అత్యధికంగా విరాళాలు ఎవరు ఇచ్చారో తెలుసా..? బిల్‌గేట్స్‌ మాత్రం కాదు..

Jamsetji Tata Tops Global List Of Philanthropists - Sakshi

భారత పారిశ్రామిక పితామహుడుగా పేరొందిన జంషెడ్జీ టాటాకు అరుదైన గౌరవం దక్కింది.  గత శతాబ్దకాలంలో  దాతృత్వాన్ని చాటడంలో హురున్‌ రిపోర్ట్‌, ఎడెల్గైవ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన రిపోర్ట్‌లో జేఆర్‌ టాటా నంబర్‌.1 స్థానంలో నిలిచారు. సుమారు జేఆర్‌ టాటా 102 బిలియన్ల డాలర్ల(7.5 లక్షల కోట్ల)ను వివిధ సామాజిక కార్యాక్రమాలకోసం విరాళాలుగా ఇచ్చారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత విరాళాలను ఇచ్చిన వ్యక్తిగా జేఆర్‌ టాటా రికార్డు సృష్టించారు.

ప్రస్తుతం టాటా కంపెనీ ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ పనుల వరకు చేస్తోంది. జేఆర్‌ టాటా తరువాత , బిల్‌గేట్స్‌ అతని  భార్య మిలిందా గేట్స్‌ సుమారు 74.6 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో , వారెన్‌ బఫెట్‌ 37.4 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ,  జార్జ్‌ సోరోస్‌ 34.8 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్ధానంలో నిలిచారు. గత శతాబ్ద కాలంలో అమెరికన్‌, యూరోపియన్‌కు చెందిన బిలియనీర్లు సామాజిక కార్యక్రమాలను చేయడంలో ముందున్నా..టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాను అధిగమించడంలో వెనుకబడ్డారని హురున్‌ చైర్మన్‌, పరిశోధకుడు రూపెర్ట్ హూగ్వెర్ఫ్ విలేకరులతో అన్నారు.

కంపెనీ లాభాల్లో మూడింట రెండు వంతులు విద్య, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ రంగాలకు విరాళాలను కేటాయించడంతో జంషెట్జీ టాటా ముందంజలో నిలిచారు. విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ, తన మొత్తం సంపాదనలో 22 బిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలను చేపట్టడానికి విరాళంగా ఇచ్చారు. హురున్‌ రిపోర్ట్‌, ఎడెల్గైవ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన రిపోర్ట్‌లో టాప్‌ 50 మందిలో యూఎస్‌ నుంచి 38 మంది, యూకే నుంచి ఐదుగురు, చైనా నుంచి ముగ్గురు నిలిచారు.

చదవండి: చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top