
రిలయన్స్ రిటైల్ ఇటీవల ఎలక్ట్రోలక్స్ గ్రూప్ కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ కెల్వినేటర్ కొనుగోలు డీల్‌పై కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ స్పందించారు. కంపెనీ ఉత్పత్తుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతి వినియోగదారుడి విభిన్న అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
‘కెల్వినేటర్ కొనుగోలు కంపెనీ అభివృద్ధికి ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది భారతీయ వినియోగదారులకు నమ్మకమైన ప్రపంచ ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడానికిక వీలు కల్పిస్తుంది. దానికి కంపెనీ మార్కెట్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఎంతో తోడ్పడుతుంది’ అని ఇషా చెప్పారు.
ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’
ఈ డీల్ విలువ సుమారు రూ.160 కోట్లు. దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం గృహోపకరణాల విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు రిలయన్స్ రిటైల్‌కి ఇది ఉపయోగపడనుంది. రిలయన్స్ రిటైల్ గతంలో కెల్వినేటర్ బ్రాండ్‌కి లైసెన్సు తీసుకుని, ఉపయోగించుకుంది. దీని కింద ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు మొదలైనవి అమ్ముడవుతున్నాయి.