తిరుమల సందర్శకులకు తీపికబురు!

IRCTC Tourism is Offering Special Pancha Devalayam Tour Package - Sakshi

తిరుమల తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం పంచదేవాలయం టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ కింద తిరుమలలోని శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత నుంచి ప్యాకేజీ మొదలవుతుంది. తిరుపతికి చేరుకునే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించడం కోసం ఈ ప్యాకేజీని రూపొందించారు. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ. 

పంచదేవాలయం టూర్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ(ముగ్గరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.5,270 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ(ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.7,010, సింగిల్ ఆక్యుపెన్సీ (ఒకరు మాత్రమే) ధర రూ.11,750. ప్యాకేజీలో తిరుపతిలో ఒక రోజు అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top