IRCTC Fixes Bug On E Ticketing Platform: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బగ్‌ గుర్తించిన విద్యార్థి..! 

IRCTC Fixes Bug On E Ticketing Platform After Chennai Student Raises Alarm - Sakshi

చెన్నై:  రైల్వే ఈ-టికెటింగ్‌ ప్లాట్‌ఫాం ఐఆర్‌సీటీసీలో పన్నెండో తరగతి విద్యార్థి గుర్తించిన బగ్‌ను సరిచేసినట్లు సెప్టెంబర్‌ 21న సీనియర్‌ అధికారి ప్రకటించారు. వివరాలోకి వెళ్తే.. చెన్నైలోని తాంబరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల రంగనాథ్‌ రైల్వే టికెట్‌ బుక్‌ చేద్ధామని భారత రైల్వే ఈ-టికెటింగ్‌ ప్లాట్‌ఫాం ఐఆర్‌సీటీసీకి వెళ్లాడు. గత నెలలో ఆగస్టు 30న టికెట్టు బుక్‌ చేసే సందర్భంలో వెబ్‌సైట్‌లో నెలకొన్న బగ్‌ను  గుర్తించాడు రంగనాథ్‌. వెంటనే  ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు తెలియజేశాడు.
చదవండి: గౌనులో పేలిన స్మార్ట్‌ఫోన్‌..! చర్యలకు సిద్దమైన కంపెనీ..!

బగ్‌ సహయంతో ప్రయాణికుల డేటా హ్యకర్ల చేతిలోకి వెళ్తే ప్రమాదం ఉండటంతో ఐఆర్‌సీటీసీను రంగనాథ్‌ అప్రమత్తం చేశాడు. ఈ బగ్‌తో హ్యాకర్లు  ప్రయాణికులకు సంబంధించిన పేరు, వయసు, ప్రయాణ వివరాలు, పీఏన్‌ఆర్ నంబర్, గమ్యస్థానం మొదలైనవి తెలుసుకునే అవకాశం ఉందని  రంగనాథన్ ఐఆర్‌సీటీసీకి నివేదించాడు. అంతేకాకుండా హ్యకర్లు ప్రయాణికులకు తెలియకుండానే వారి టిక్కెట్టును కూడా రద్దు చేయవచ్చునని  గుర్తించాడు. 

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బగ్‌ ఉందని ఐటీ వింగ్‌ గుర్తించింది. వెబ్‌సైట్‌లో నెలకొన్న సమస్యను పరిష్కారం చేసినట్లు సెప్టెంబర్‌ 11 తారీఖున ఐటీవింగ్‌ నుంచి రంగనాథ్‌కు ఈ-మెయిల్‌ను పంపింది. గతంలో  లింక్డ్‌ఇన్, యునైటెడ్ నేషన్స్, బైజూస్‌, నైక్, లెనోవో, అప్‌స్టాక్స్ వెబ్ అప్లికేషన్‌లలో భద్రతా లోపాలను గుర్తించాడు. 
చదవండి: Neeraj Chopra: అప్పుడేమో రాహుల్‌ ద్రావిడ్‌..ఇప్పుడు నీరజ్‌ చోప్రా..! సరికొత్త రూపంలో..

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top