రైల్వేతో కలిసి పనిచేస్తారా? రూ.80 వేల వరకూ సంపాదించుకోవచ్చు!

IRCTC Agent job Indian Railways helps to earn upto Rs 80000 per month - Sakshi

రైల్వేలో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటారు. అయితే తక్కువ సంఖ్యలో పోస్టులు, తీవ్రమైన పోటీ కారణంగా ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. అయినా పర్వాలేదు.. రైల్వేతో కలిసి పనిచేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కల్పిస్తోంది.

ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?

ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా చేరితే మంచి మొత్తంలో సంపాదించుకోవచ్చు. ఇందులో చేరేవారిని రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తారు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. కార్యాలయం అవసరం లేదు. ఇంట్లో నుంచే కంప్యూటర్‌లో ఈ పని చేసుకోవచ్చు. రైల్వేలో టికెట్ క్లెర్క్‌లు చేసే పనినే ఈ ఏజెంట్లు ఇంటి వద్ద నుంచి చేయాలి. మీరు బుక్ చేసిన టికెట్లకు ఐఆర్‌సీటీసీ కమీషన్ ఇస్తుంది.

ఇదీ చదవండి: గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! 

సంపాదన ఇలా..
నాన్ ఏసీ కోచ్ టిక్కెట్‌ను బుక్ చేస్తే ఒక్కో టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ టికెట్‌ను బుక్ చేస్తే రూ.40 చొప్పున ఏజెంట్‌కు కమీషన్‌ వస్తుంది. అలాగే టికెట్ ధరలో ఒక శాతం డబ్బును కూడా ఏజెంట్‌కు ఇస్తారు. ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు పరిమితి లేకుండా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే 15 నిమిషాల్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసే అవకాశం కూడా ఉంది. మీరు బుక్ చేసిన టిక్కెట్ల ఆధారంగా మీ సంపాదన ఉంటుంది.

ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!

మంచి బుకింగ్ లభిస్తే నెలకు  రూ.80 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏజెంట్‌గా చేరాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ రుసుము కింద సంవత్సరానికి రూ.3,999 చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు సంవత్సరాలకు అయితే రూ. 6,999 చెల్లించాలి. నెలలో 100 టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top