లాంచ్‌కు ముందే వివరాలు లీక్.. ఐఫోన్ 16 ఇలాగే ఉంటుందా!

iPhone 16 Display Chipset And Camera Details Leak - Sakshi

ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ విడుదల చేస్తున్న యాపిల్.. ఐఫోన్ 16 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. విడుదల చేయడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే దీనికి సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 డిజైన్, కెమెరా, చిప్‌సెట్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

డిజైన్
లీకైన సమాచారం ప్రకారం, రానున్న కొత్త ఐఫోన్ సాలిడ్-స్టేట్ బటన్‌లను పొందే అవకాశం ఉంది. కంపెనీ దీనిని ఐఫోన్ 16 ప్రో మోడల్‌లలో క్యాప్చర్ బటన్‌గా అందించే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, స్పర్శను వంటి వాటిని గుర్తించేలా ఉంటుంది.

డిస్‌ప్లే
2024లో విడుదల కానున్న కొత్త ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ స్క్రీన్‌, ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. కాగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ స్క్రీన్‌లు వరుసగా 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ వరకు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా రాబోయే ఈ కొత్త మోడల్స్ శాంసంగ్ అందించే ఓఎల్ఈడీ మెటీరియల్‌ కలిగి.. బ్లూ ఫాస్ఫోరోసెన్స్‌తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు. మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ మల్టిపుల్ కలర్స్‌లో లాంచ్ అవ్వనున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి.

చిప్‌సెట్
వచ్చే సంవత్సరం విడుదలకానున్న కొత్త ఐఫోన్ 16 చిప్‌సెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ ఇది ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలోని A17 ప్రో చిప్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ రానున్న కొత్త ఐఫోన్స్ కోసం 3 నానోమీటర్ A18 చిప్‌ అందించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. చిప్‌సెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

కెమెరా సెటప్
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లు 'టెట్రా-ప్రిజం' టెలిఫోటో కెమెరాను పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫొటోల కోసం ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో (లైటింగ్) కూడా మంచి పనితీరుని అందిస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top