
iPhone 12 Discount: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్లు యాపిల్ ఐఫోన్12పై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. దీంతో ఐఫోన్ 12 ఫోన్ రీటైల్ మార్కెట్ లో ఉన్న ధర కంటే భారీగా తగ్గనుంది.
ఐఫోన్ 12 మోడల్స్ ధర ఉన్న స్టాక్‌తో పాటు కలర్ వేరియంట్ ఆధారంగా ఆఫర్ పొందవచ్చు. అమెజాన్‌లో ఐఫోన్-12 64 జీబీ బ్లాక్ వేరియంట్ ఫోన్ ను కేవలం రూ.42,049కి కొనుగోలు చేయోచ్చు. అయితే, మీరు ఎక్ఛేంజ్ ఆఫర్‌తో ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ.14,950 వరకు తగ్గిస్తుంది. ఇంకా, ఐఫోన్12ను సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1500 తక్షణ తగ్గింపు, ఈఎంఐ ట్రాన్సాక్షన్‌లపై డిస్కౌంట్‌లు,హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లు, మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లపై అమెజాన్ డిస్కౌంట్/క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
మరోవైపు, మీరు ఫ్లిప్‌కార్ట్ సైతం ఐఫోన్ పై ఆఫర్లు ప్రకటించింది. 64జీబీ బ్లాక్ కలర్ వేరియంట్ ఐఫోన్ 12ని రూ. 44,799కి కొనుగోలు చేయోచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,601 తగ్గింపుతో రూ.60,299కి విక్రయిస్తోంది. ఎక్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 15,500 వరకు తగ్గుతుంది. దీంతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్‌లో రూ.44,799 వద్ద స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు.