ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్‌ కూడా..వేలాదిమందికి

Intel Layoffs Sends Thousands Of Employees On Unpaid Leave Check Details - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల మెడపై ఉద్వాసనల కత్తి వేలాడుతోంది. తాజాగా చిప్‌మేకర్ ఇంటెల్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల జీతం లేని సెలవులతో వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను ఇంటికి పంపిస్తోంది. 

క్లిక్‌ చేయండి:  పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్‌ తప్పదు! డెడ్‌లైన్‌ ఎపుడో తెలుసా?
 
తాజా మీడియా నివేదికల ప్రకారం  ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇంటెల్‌ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగులపై వేటు వేసింది. "వర్కర్ అడ్జస్ట్‌మెంట్  అండ్‌ రీట్రైనింగ్ నోటిఫికేషన్‌ల" ప్రకారం 111 మంది ఉద్యోగులను తొలగించగా, 90 మంది ఉద్యోగులను కంపెనీ హెడ్‌ క్వార్టర్‌ శాంటా క్లారా లొకేషన్ నుంచి బయటికి పంపింది. 2023 జనవరి 31 నుండి తొలగింపులు ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి, ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందట.

(మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!)

ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగా ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అక్టోబరులో కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల కాల్ సందర్భంగా, ఇంటెల్  సీఈవో పాట్ గెల్సింగర్  వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా  పీసీ విక్రయాలు పడిపోవడంతో ఇంటెల్‌ వేలాదిమందిని తొలగించనుందని గతంలోనే  నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (5జీ, ఇతర స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లో అదరిపోయే ఆఫర్లు)

కాగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 853 కంప్యూటర్ వ్యాపార సంస్థలు  దాదాపు 137,492 మంది కార్మికులను తొలగించాయి. రానున్న ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెటా, ట్విటర్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ సహా అనేక ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపులో ముందంజలో ఉన్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top