5జీ, ఇతర స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు 

Amazon Smartphone Upgrade Days 2022 check details - Sakshi

సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్‌ సేల్‌కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్‌ఫోన్స్‌ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్‌తోపాటు, వన్‌ప్లస్‌ 10 ప్రొ, ఐఫోన్‌ 14, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3 సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు  కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు.

అమెజాన్ ఆఫర్లు
శాంసంగ్‌ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది.  రెడ్‌మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్‌మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్‌ మీ నోట్‌ 11  రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు.

ఒప్పో ఎఫ్‌ 21ఎస్‌ ప్రొ 5జీ:
ఒప్పో ఎఫ్‌21ఎస్‌ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్‌ఆఫర్‌గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా  పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్‌లో, ఒప్పో ఏ76, ఏ77  వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి.

లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్‌​ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్‌3  రూ.6,299కే లభ్యం.

టెక్నో
టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి.  అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్‌ 19 మాండ్రియన్‌  వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top