
స్థానిక వ్యాపారాలకు బూస్ట్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాడే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఈరోజు నుంచి భారత మార్కెట్‌లో “మ్యాప్” ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, కేఫేలు, టూరిస్టు ప్రదేశాలు, షాపింగ్ సెంటర్లు, ఈవెంట్లు మొదలైనవాటిని ప్రత్యక్షంగా మ్యాప్‌లో వీక్షించవచ్చు.
ఈ ఫీచర్‌తో స్థానిక వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్లు తమ పోస్టులు లేదా స్టోరీల్లో లొకేషన్ ట్యాగ్ చేస్తే — ఆ కంటెంట్ ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ వ్యూలో కూడా ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న ఇతర యూజర్లు ఆ ప్రదేశాన్ని సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి.
ఈ ఫీచర్‌లో యూజర్లు లొకేషన్ ట్యాగ్‌లను పూర్తి నియంత్రణలో ఉంచవచ్చు. లొకేషన్‌ను పబ్లిక్‌గా, ఫ్రెండ్స్‌కి మాత్రమే లేదా ప్రైవేట్‌గా ఉంచే ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్ల లోపు వయసున్న యూజర్ల ఖాతాల్లో లొకేషన్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.
భారతీయ యూజర్లలో లొకేషన్ ఆధారిత కంటెంట్ వినియోగం వేగంగా పెరుగుతోందని, అందుకే ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా ప్రారంభించినట్లు ఇన్‌స్టా వర్గాలు చెబుతున్నాయి.