Instagram: ఇన్‌స్టా యూజర్లకి గుడ్‌ న్యూస్‌.. కిరాక్‌ ఫీచర్‌ రాబోతోంది!

Instagram Develops New Map Feature Find Nearby Popular Locations - Sakshi

ఎప్పటికప్పుడు లేటస్ట్‌ అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ఇన్‌స్టాగ్రామ్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇంతవరకు ఫోటో షేరింగ్‌, వీడియో రీల్స్‌, చాటింగ్‌ వంటివాటితో యూజర్లను తనవైపు తిప్పుకున్న ఇన్‌స్టా తాజాగా మ్యాప్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ ఫీచర్లతో యూజర్లు సులభంగా కొత్త లొకేషన్లను కనుగొనవచ్చు.

ఇన్‌స్టా ఐజీ(IG)లో కొత్తగా మ్యాప్‌ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, వివిధ ప్రసిద్ధ స్థలాలను కనుగొనవచ్చు. గతంలో యూజర్లు ఒక లొకేషన్ సందర్శించినప్పుడు వాళ్లు షేర్‌ చేసిన పోస్ట్‌లను మాత్రమే చూడగలిగేవారు. కానీ, లొకేషన్ వివరాల గురించి తెలుసుకునే వీలు ఉండేది కాదు. అయితే ఇన్‌స్టాలో రాబోయే లేటెస్ట్ అప్‌డేట్ మ్యాప్‌ ఫీచర్‌ ద్వారా లోకేషన్‌ వివరాలు కూడా తెలుసుకునేలా వీలు కల్పించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ గత సంవత్సరం కొన్ని దేశాలలో ఈ మ్యాప్‌ ఫీచర్‌ని పరీక్షించింది. ఇది మనకి సమీపంలోని స్థలాల వివరాలు లేదా కేవలం మనకు కావాల్సిన షాపులను మాత్రమే చూపిస్తుంది. యూజర్లు ఒక ప్రాంతం కోసం సెర్చ్‌ చేసిన తర్వాత, అనవసరమైన వాటిని పక్కన పెట్టేందుకు అందులో ఫిల్టర్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్‌ చేసుకుని మనం ఎంచుకున్న రెస్టారెంట్‌లు, బార్‌లు, పార్కులు లేదా  ఇతర స్థలాలను చూడవచ్చు.

చదవండి: OnePlus 10T 5G: అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్‌ 10టీ.. గ్రాండ్‌ లాంచ్‌ అప్పుడే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top