UPI Payments: ఇక మన చెల్లింపులు.. ఆ ఇబ్బందులు తొలగినట్లే!

Indians Visitors To UAE Now Use UPI Apps for Online Payments - Sakshi

అబుదాబి: యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్‌. ఆన్‌లైన్‌ పేమెంట్ల విషయంలో భారతీయ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది యూఏఈ. తద్వారా UPI పేమెంట్లకు అనుమతి ఇచ్చిన మూడో దేశంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిలిచింది.

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NCPI).. మష్రెక్యూ బ్యాంక్‌ భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్‌ అవకాశం కల్పించనుంది. ఇండియాలో ఎలాగైతే యూపీఐ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటున్నారో.. యూజర్లు ఇక అదే రీతిలో విదేశీ ట్రాన్‌జాక్షన్‌లు చేసుకోవచ్చు. తద్వారా వ్యాపార, ఇతరత్ర వ్యవహారాలపై యూఏఈని సందర్శించే 20 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. సందర్శకులతో పాటు యూఏఈ వాసులకు సైతం క్యాష్‌లెష్‌ పేమెంట్స్‌కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని ఎఐపీఎల్‌ సీఈవో రితేష్‌ శుక్లా వెల్లడించారు. ఇంతకు ముందు  సింగపూర్‌, భూటాన్‌లు యూపీఐ పేమెంట్స్‌కు అనుమతి ఇచ్చాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్‌ ఉండగా.. అందులో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్‌ పే మార్కెట్‌లో పాపులర్‌ అయ్యాయి.

చదవండి: అఫ్గన్‌ కార్మికుల సంగతి ఏంటి?

ప్రయాణికులకు ఊరట
పాస్‌పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు టూరిస్ట్‌ వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్‌, నైజీరియా, పాకిస్థాన్‌, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: భార్య ఎఫైర్లన్నీ వెబ్‌సైట్‌లో.. సొంతవాళ్లపైనే భర్త అఘాయిత్యాలని ఆరోపణలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top