టాప్‌-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్‌

Indian IT sector to add over 96k employees in FY21 : Nasscom - Sakshi

ఐటీ నిపుణులకు అవకాశాలు మెండు: నాస్కామ్‌

ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలకు నష్టం లేదు

కేవలం టాప్‌ 5 ఐటీ సంస్థల్లోనే 96 వేల కొలువులు

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంతో ఐటీ నిపుణులకు అవకాశాలు  మెండుగా వచ్చి పడుతున్నాయని ఐటీ పరిశ్రమ వాదిస్తోంది. ఆటోమేషన్‌వల్ల ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం ఏర్పడుతోందన్న తాజా వాదనపై స్పందించిన ఐటీ పరిశ్రమ బాడీ నాస్కామ్‌ ప్రస్తుతం ఐటీ పప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్‌ కనిపిస్తోందని గురువారం పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని టాప్‌-5 ఐటీ సంస్థలు  2021-22లో 96వేలమంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయని తెలిపింది. 2022 సంవత్సరం నాటికి భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు 30 లక్షల ఉద్యోగాలను తొలగించబోతున్నాయని, తద్వారా సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదించిన తర్వాత నాస్కామ్  ప్రకటన రావడం గమనార్హం. 

దేశీయ ఐటీ రంగంలో 2021-22 సంవత్సరంలో నియామకాలు పుంజుకోనున్నాయని నాస్కామ వాదించింది.ఆటోమేషన్‌ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందన్న బీఓఏ వ్యాఖ్యలపై స్పందిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో, పెరుగుతున్న ఆటోమేషన్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలు, పాత్రల స్వభావం మారనుందని, ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. నిపుణులకు, ప్రతిభావంతులకు డిమాండ్‌ బాగుందని, 2021 ఏడాదిలో 1,38,000 ఉద్యోగులను చేర్చుకుందని నాస్కామ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. టాప్-5 సంస్థలే సుమారు 96 వేల మందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నాయని పేర్కొంది. దీంతోపాటు 2 లక్షల 50వేల మందికి పైగా ఉద్యోగుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తోందని, అలాగే 40 వేలమందిని డిజిటల్‌ ప్రతిభావంతులను నియమించిందని తెలిపింది.

దేశంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) రంగంలో1.4 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని నాస్కామ్‌ తెలిపింది. ఆటోమేషన్‌లో కీలకమైన ఐటీ-బీపీఎంలో మార్చి 2021నాటికి ఐటీ-బీపీఎంలోరంగంలో మొత్తం 4.5 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని పేర్కొంది. గత 3 సంవత్సరాల్లో ఆటోమేషన్, ఆర్‌పిఎ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్) బీపీఎం రంగంలో ఉద్యోగాల సృష్టికి దారితీసిందని అసోసియేషన్ వివరించింది.

చదవండి: కరోనా సంక్షోభం: గూగుల్‌ మరోసారి భారీ సాయం
Edible oil: వినియోగదారులకు భారీ ఊరట

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top