భారత్‌ ఎకానమీ రికవరీ బాట

Indian Economy Rapidly Recovering Says By Ajay Seth - Sakshi

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌

ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కారణమని విశ్లేషణ    

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ రికవరీ బాటన వేగంగా పయనిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో గడచిన ఏడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు దీనికి కారణమని అన్నారు. మహమ్మారి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు ప్రభుత్వం సంస్కరణల ప్రక్రియను కొనసాగించినట్లు తెలిపారు. పలు వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ‘‘మహమ్మారి సవాళ్లు విరిసిన 18 నెలల్లో ఈ సమస్యలను కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా నిర్వహించింది. ప్రత్యేకించి సంస్కరణల పటిష్ట అజెండా అమలు ద్వారా ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన రికవరీ బాటన నిలబెట్టింది. దీనితో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పుంజుకునే అవకాశం ఏర్పడింది’’ ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్‌ కార్యక్రమంలో అని ఆయన అన్నారు. 
కొనసాగుతున్న సవాళ్లు ఇవీ... 
మహమ్మారి నేపథ్యంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి పుంజుకోకపోవడం కొంత నిరాశ కలిగిస్తోందని అన్నారు. ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనం దీనికి ప్రధాన కారణమని వివరించారు. మౌలిక రంగం పురోగతి కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలని ఆయన పారిశ్రామిక వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జీడీపీలో మౌలిక విభాగం పెట్టుబడుల వాటా 5 నుంచి 6 శాతం ఉందని ఆయన పేర్కొంటూ ఈ పరిమాణం రెట్టింపు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం–పరిశ్రమ మధ్య సన్నిహిత సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు.
 

చదవండి : ఎల్రక్టానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ ట్రేడింగ్‌పై బీఎస్‌ఈ కసరత్తు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top