సెమీకండక్టర్ల మార్కెట్‌ @ రూ. 9.6 లక్షల కోట్లు  | India Semiconductor market Rs. 9. 6 lakh crore by 2030 | Sakshi
Sakshi News home page

సెమీకండక్టర్ల మార్కెట్‌ @ రూ. 9.6 లక్షల కోట్లు 

Aug 10 2025 5:49 AM | Updated on Aug 10 2025 5:49 AM

India Semiconductor market Rs. 9. 6 lakh crore by 2030

దేశీయంగా 2030 నాటికి రెండు రెట్లు వృద్ధి 

అంతర్జాతీయ సప్లై చెయిన్‌లో కీలకంగా భారత్‌ పరిశ్రమ అంచనాలు

న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల మార్కెట్‌ 2030 నాటికి 100–110 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 9.6 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం రెండు రెట్లు వృద్ధి చెందనుంది. 2023లో 38 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ 2024–25లో 45–50 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఈ రంగంపై తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా తదితర దేశాల ఆధిపత్యం ఉంటోందని వివరించాయి. 

సెమీకండక్టర్ల ఆవశ్యకత, కోవిడ్‌ మహమ్మారి కాలంలో నిర్దిష్ట ప్రాంతాలపై ఆధారపడటం వల్ల ఆటోమొబైల్‌ తదితర సెగ్మెంట్లు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు, సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమ స్పందన తదితర అంశాల గురించి ఇందులో తెలిపాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ ఎదగాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ప్రకటన ప్రకారం.. ప్రపంచంలో తయారయ్యే మొత్తం సెమీకండక్టర్లలో తైవాన్‌ 60 శాతం ఉత్పత్తి చేస్తోంది. అత్యంత అధునాతన సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌ వాటా ఏకంగా 90 శాతం ఉంటోంది. 

ఒకే ప్రాంతంపై భారీగా ఆధారపడటమనేది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌ తరహా మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లాంటి అనేకానేక అంశాల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించాయి. దీన్ని గుర్తించే చాలా దేశాలు ప్రస్తుతం సురక్షితమైన, వైవిధ్యమైన సరఫరా వ్యవస్థలను ఏర్పర్చుకుంటున్నాయని పేర్కొన్నాయి. అమెరికా, యూరోపియన్‌ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశీయంగా చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు, ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయని వివరించాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల్లో భారత్‌ కూడా కీలకమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నాయి.  

1 ట్రిలియన్‌ డాలర్లకు గ్లోబల్‌ మార్కెట్‌ .. 
పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2030 నాటికి అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల మార్కెట్‌ 1 ట్రిలియన్‌ (లక్ష కోట్లు) డాలర్లకు చేరనుంది. భారత్‌ ఇందులో గణనీయమైన వాటా దక్కించుకునే అవకాశం ఉంది. సెమీకండక్టర్ల తయారీ సరఫరా వ్యవస్థకు మూడు ప్రధాన మూల స్తంభాలైన పరికరాలు, మెటీరియల్స్‌..సరీ్వసులు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాల విభాగాల్లో కీలక భాగస్వామిగా ఎదిగే సత్తా భారత్‌కి ఉంది. 

సెమీకండక్టర్ల ఎక్విప్‌మెంట్‌కి అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేసేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) ఉపయోగించుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్‌ సప్లై చెయిన్‌ కంపెనీలకు అవసరమైన రసాయనాలు, లోహాలు మొదలైనవి మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయని వివరించాయి. ఇక సరీ్వసుల విషయానికొస్తే ఆర్‌అండ్‌డీ, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థకు సంబంధించి కృత్రిమ మేథ, బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)లాంటి విభాగాల్లోనూ భారత్‌ పటిష్టంగా ఉందని పేర్కొన్నాయి.  

ప్రభుత్వం దన్ను.. 
అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్‌ వేల్యూ చెయి న్‌లకి భారత్‌ను మరింతగా అనుసంధానం చేసే దిశగా సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్, డిస్‌ప్లేల తయారీ, చిప్‌ డిజైన్‌ మొదలైన వాటిల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిశ్రమకు ఆర్థిక మద్ద తు కలి్పంచేలా 2021 డిసెంబర్‌లో రూ. 76,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ను ఆవిష్కరించింది. 

అమెరికాకు చెందిన మెమొరీ చిప్‌ల తయారీ దిగ్గజం మైక్రాన్, టాటా సెమీకండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ (టీఎస్‌ఏటీ), కేనెస్‌ సెమీకాన్, హెచ్‌సీఎల్‌–ఫాక్స్‌కాన్‌లతో పా టు తైవాన్‌ సంస్థ పవర్‌చిప్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ (పీఎస్‌ఎంసీ) భాగస్వామ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్‌ (టీఈపీఎల్‌), రెనిసాస్‌ అండ్‌ స్టార్స్‌ భాగస్వామ్యంలో సీజీ పవర్‌ అండ్‌ ఇండ్రస్టియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మొదలైనవి భారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం రూ. 1.55 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం) కింద చిప్‌ డిజైనింగ్‌ కోసం రూ. 1,000 కోట్లతో డిజైన్‌ ఆధారిత ప్రోత్సాహకాలకు కూడా ఐఎస్‌ఎం ప్రొవిజనింగ్‌ ఏర్పాటు చేసింది.

 అర్హత కలిగిన స్టార్టప్‌లకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ఇందులో రూ. 234 కోట్లు కేటాయించారు. ‘22 కంపెనీలు ప్రతిపాదించిన చిప్‌ డిజైన్‌ ప్రాజెక్టులకు కేంద్రం రూ. 234 కోట్ల మద్దతుకి హామీ ఇచి్చంది. ఈ మొత్తం ప్రాజెక్టుల వ్యయం రూ. 690 కోట్లుగా ఉంటుంది. ఈ చిప్‌లను సీసీటీవీ కెమెరాలు, మొబైల్‌ నెట్‌వర్క్‌లు, ఉపగ్రహాలు, కార్లు, స్మార్ట్‌ డివైజ్‌లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. దేశీయంగా చిప్‌ల తయారీ వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో సెమీకండక్టర్‌ ఎక్విప్‌మెంట్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంటర్నేషనల్‌ (సెమీ) భాగస్వామ్యంతో కేంద్రం సెమీకాన్‌ ఇండియా సదస్సుకు కూడా మద్దతునిస్తోంది‘ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

ఈ సదస్సులో అంతర్జాతీయ పరిశ్రమ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు కూడా పాల్గొంటాయి. పె ట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలకు ఇది వేదికగా నిలుస్తోంది. ఈ ఏడాది సెపె్టంబర్‌ 2 నుంచి 4 వరకు సెమీకాన్‌ ఇండియా 4వ ఎడిషన్‌ న్యూఢిల్లీలో జరుగనుంది. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం), సెమీ కలిసి సెమీకాన్‌ ఇండియా 2025ని నిర్వహించనున్నాయి. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల వ్యవస్థలో భారత్‌ పాత్ర గురించి చాటి చెప్పే విధంగా ఈ సదస్సు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement