వెహికల్ సేఫ్టీ కోసం స్వదేశీ ఎన్‌సీఏపీ రేటింగ్‌ అవసరం: నితిన్ గడ్కరీ

India To Have Own NCAP Rating For Vehicle Safety Standard - Sakshi

న్యూఢిల్లీ: కొత్త వాహనాల భద్రతను తనిఖీ చేయడానికి, ప్రపంచ రేటింగ్ సంస్థల నిబందనలకు అనుగుణంగా భద్రత నాణ్యత విషయంలో వాహనాలకు స్టార్ రేటింగ్స్ కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్(ఎన్‌సీఏపీ) వ్యవస్థను తీసుకొస్తుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. అన్ని ప్యాసింజర్ వాహనాలకు ప్రభుత్వం ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేస్తుందని ఆయన అన్నారు.

త్రీ పాయింట్ సీట్ బెల్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్(ఏఈబీఎస్) సహా ఇతర ఫీచర్లు కూడా వాహనాలకు తప్పనిసరి ఫీచర్లుగా ఉండబోతున్నాయని ఆయన తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్(పీఎల్ఐ) పథకం వంటి చర్యలు ఎయిర్ బ్యాగుల దేశీయ ఉత్పత్తిని పెంచాయని, ఫలితంగా ధరలు తగ్గాయని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల జీడీపీకి 3.1% నష్టం వాటిల్లుతుందని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

(చదవండి: మార్కెట్‌లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక యువత తగ్గేదె లే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top