జీఎస్‌టీ వసూళ్లు జూమ్‌  | India Goods and Services Tax collections have jumped | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ వసూళ్లు జూమ్‌ 

Jun 2 2025 6:32 AM | Updated on Jun 2 2025 6:32 AM

India Goods and Services Tax collections have jumped

మే నెలలో రూ. 2 లక్షల కోట్లు 

న్యూఢిల్లీ: స్థూలంగా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు గత నెలలో 16.4 శాతం జంప్‌ చేశాయి. రూ. 2.01 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే నెలలో స్థూలంగా దేశీ లావాదేవీల విలువ 13.7 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లను తాకింది. దిగుమతుల జీఎస్‌టీ ఆదాయం 25 శాతంపైగా పెరిగి రూ. 51,266 కోట్లకు చేరింది. 

అంతకుముందు నెల(ఏప్రిల్‌)లో జీఎస్‌టీ వసూళ్లు సరికొత్త రికార్డ్‌కు తెరతీస్తూ రూ. 2.37 లక్షల కోట్లుగా నమోదైన విషయం విదితమే. గత నెలలో స్థూల సెంట్రల్‌ జీఎస్‌టీ ఆదాయం రూ. 35,434 కోట్లుకాగా.. రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం రూ. 43,902 కోట్లకు చేరింది. సమీకృత జీఎస్‌టీ రూ. 1.09 లక్షల కోట్లుగా నమోదైంది. సెస్‌ నుంచి రూ. 12,879 కోట్ల ఆదాయం లభించింది.  

Advertisement
 
Advertisement
Advertisement