Income Tax Department Using Artificial Intelligence to Crack Down Tax Fraud - Sakshi
Sakshi News home page

ఇక మీ పప్పులుడకవ్‌..వేతన జీవులకు కేంద్రం హెచ్చరిక!

Published Sat, Jul 22 2023 6:12 PM

Income Tax Department using Artificial Intelligence To Crack Down Tax Fraud - Sakshi

వేతన జీవులకు అలెర్ట్‌. కేంద్ర ఆర్ధిక శాఖ విభాగానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం కృత్తిమ మేధ (artificial intelligence)ను ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌లో (ఐటీఆర్‌) తప్పుడు సమాచారం అందించినా, ఫైలింగ్‌లో తప్పులు దొర్లినా, ఇంటి రెంట్‌ చెల్లిస్తున్నామంటూ ఇతర కుటుంబసభ్యుల పేర్ల మీద ఫేక్‌ రెంట్‌ రిసిప్ట్‌లు తయారు చేసినా, తప్పుడు విరాళాలు ఇస్తున్నట్లు తేలినా, అనుమానాస్పద రుణాలతో పాటు ఇంకా ఇతర అనైతిక పద్ధతుల్ని గుర్తించనుంది. ఫైలింగ్‌ సమయంలో జరిగే లోపాల్ని గుర్తించేలా ఏఐని ఉపయోగిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.  
 
ఇటీవల, ఐటి అధికారులు ట్యాక్స్‌ ఫైలింగ్‌ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లకు సంబంధించి ఆధారాలు చూపించాలని శాలరీ ఉద్యోగులు నోటీసులు జారీ చేసింది. వారిలో సెక్షన్ 10 (13ఎ) కింద ఇంటి అద్దె అలవెన్స్ కింద మినహాయింపులు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఐటి చట్టంలోని సెక్షన్ 24 (బి) కింద మినహాయింపులు, అధికారిక విధులను నిర్వహించేలా ఉద్యోగుల(హెల్పర్‌)ను నియమించుకున్నట్లు సెక్షన్ 10 (14) కింద అలవెన్స్‌ల కోసం ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేసిన ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.   

ఈ సందర్భంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిని కనిపెట్టేలా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. కొద్ది మొత్తంలో పన్ను చెల్లించే శాలరీడ్‌ ఉద్యోగులు ఐటీఆర్‌ ఫైలింగ్‌లో మోసాలకు పాల్పడితే తమని ఎవరు గుర్తిస్తారు? అనే ధోరణిలో ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. కాబట్టి ట్యాక్స్‌ ఫైలింగ్‌ సమయంలో వేతన జీవులు నిబంధనలకు లోబడి ఫైలి చేయాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : అమెజాన్‌ కొత్త పాలసీ.. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో!, ఆందోళనలో ఉద్యోగులు

Advertisement

తప్పక చదవండి

Advertisement