రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్‌వేర్‌ ఆదాయం | Sakshi
Sakshi News home page

రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్‌వేర్‌ ఆదాయం

Published Fri, Dec 10 2021 2:26 PM

IDC Research Says Indian software Market Income Will Crossed 8.2 Bn - Sakshi

న్యూఢిల్లీ: భారత సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ ఆదాయం 2021 చివరికి 8.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 60 వేల కోట్లు) ను అధిగమిస్తుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేసింది. ‘‘భారత సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ ఆదాయం 2021 మొదటి ఆరు నెలల్లో 4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది వార్షికంగా చూస్తే 15.9 శాతం వృద్ధి’’ అని తెలిపింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో జపాన్, చైనా మినహాయించి చూస్తే భారత్‌ వాటా 18.3 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2021 మొదటి ఆరు నెలల్లో భారత మార్కెట్లో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఎస్‌ఏపీ అగ్రపథంలో కొనసాగినట్టు వెల్లడించింది. భారత కంపెనీలు మరింత విస్తరించే లక్ష్యంతో డిజిటల్‌కు మారిపోతున్నట్టు, క్లౌడ్, ఏఐపై పెట్టుబడులు పెంచుతున్నట్టు తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ను అప్లికేషన్స్, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిప్లాయ్‌మెంట్‌ (ఏడీ అండ్‌డీ), సిస్టమ్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సాఫ్ట్‌వేర్‌ (ఎస్‌ఐ) అనే మూడు భాగాలు ఐడీసీ వర్గీరించింది. మొత్తం పరిశ్రమ ఆదాయంలో అప్లికేషన్స్‌ నుంచే 61 శాతం వస్తోందని, ఆ తర్వాత ఏడీ అండ్‌డీ నుంచి 21 శాతం, ఎస్‌ఐ సాఫ్ట్‌వేర్‌ నుంచి 18 శాతం చొప్పున ఆదాయం వస్తున్నట్టు వివరించింది.   
 

Advertisement
Advertisement