సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న  ఐసీఐసీఐ బ్యాంక్‌..! | ICICI Bank Reports Highest Ever Net Profit In Q2 | Sakshi
Sakshi News home page

ICICI Bank: సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న  ఐసీఐసీఐ బ్యాంక్‌..!

Oct 24 2021 10:59 AM | Updated on Oct 24 2021 11:02 AM

ICICI Bank Reports Highest Ever Net Profit In Q2 - Sakshi

ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ 2021-2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సరికొత్త రికార్డును నమోదుచేసింది. క్యూ2 ఫలితాల్లో ఐసీఐసీఐ  అంచనాలకు మించి ఫలితాలను రాబట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 30 శాతం పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. ఐసీఐసీఐ క్యూ2లో రూ. 5511 కోట్ల లాభాలను గడించింది.
చదవండి: అదరగొట్టిన టీవీఎస్‌ మోటార్స్‌..!

గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే.. నెట్ ప్రాఫిట్ భారీగా మెరుగుపడింది.  గత ఏడాది క్యూ2లో రూ. 4,251 కోట్ల రూపాయల నెట్‌ ప్రాఫిట్‌ను ఐసీఐసీఐ సాధించింది. క్యూ2 లో సుమారు రూ. 5,441 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌ వస్తోందని ఐసీఐసీఐ భావించగా..గడిచిన త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలను సాధించింది. అంతేకాకుండా ఐసీఐసీఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ కూడా 25 శాతం మేర పెరిగి, రూ. 11,690 కోట్ల రూపాయలకు చేరుకుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రేట్‌ 4 శాతానికి చేరగా.. గత ఏడాది రెండో త్రైమాసికంలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.89గా నమోదైంది. 

తగ్గిన నిరార్థక ఆస్తుల విలువ..!
నిరార్థక ఆస్తుల(నాన్ పెర్మార్మింగ్ అసెట్స్-ఎన్పీఏ) విలువ 12 శాతం మేర, రూ. 8,161 కోట్లకు తగ్గింది.  2014 తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్‌పీఏ ఆస్తులు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్‌పీఏ ఆస్తుల విలువ రూ. 9,306 కోట్లుగా ఉండగా.. రెండో త్రైమాసికంలో ఎన్‌పీఏ ఆస్తులు విలువ రూ.  8,161 కోట్లకు చేరింది. 
చదవండి: ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన టెస్లా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement