Srishti Jupudi: అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సృష్టి జూపూడి | Hyderabad Girl Srishti Jupudi Appointed BRICS CCI Brand Ambassador | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ సీసీఐ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సృష్టి జూపూడి

Apr 1 2021 12:46 PM | Updated on Apr 1 2021 4:30 PM

Hyderabad Girl Srishti Jupudi Appointed BRICS CCI Brand Ambassador - Sakshi

సృష్టి జూపూడి

బ్రిక్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ(సీసీఐ) అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ (2021–22)గా హైదరాబాద్‌కు చెందిన సృష్టి జూపూడి నియమితులయ్యారు.

సాక్షి, న్యూఢిల్లీ: వాణిజ్య ప్రోత్సాహక అంతర్జాతీయ సంస్థ బ్రిక్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ(సీసీఐ) అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ (2021–22)గా హైదరాబాద్‌కు చెందిన సృష్టి జూపూడి నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుందని సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ప్రపంచ మాజీ ఛాంపియన్‌ సృష్టి జూపూడి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాల్లో ఎంఎస్‌ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, అంకుర సంస్థల ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారని సంస్థ తెలిపింది. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందిన సృష్టి జూపూడి పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో పాల్గొన్నారు.

సంపూర్ణ నైపుణ్యం సాధించాలంటే పదివేల గంటల శిక్షణ అవసరం అని నిర్వచించే మాల్కమ్‌ గ్లాడ్‌వెల్‌ ‘10,000 గంటల నిబంధన’ను సృష్టి జూపూడి సాధించారని, జూనియర్‌ విభాగంలో టాపర్‌గా ఉన్న సమయంలోనే బ్యాడ్మింటన్‌కు విరామమిచ్చి సామాజిక మార్గాన్ని ఎంచుకున్నారని సంస్థ పేర్కొంది. 

ఇక్కడ చదవండి:
యూట్యూబ్‌ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్‌కి చెక్ పెట్టనుందా?

వామ్మో! బ్యాంక్‌లకు ఇన్ని రోజులు సెలువులా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement