ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్‌ వైడ్‌గా..

Hyderabad Get Rank 128th Globally In Appreciation In Housing - Sakshi

కోవిడ్‌ కారణంగా సామాన్యుల్లో సొంతిల్లు కొనుగోలు చేయాలని కోరిక పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో గృహాల కొనుగోళ్లు, అదే సమయంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి.

ఇటీవల ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌  మూడో త్రైమాసికానికి సంబంధించి ‘గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌’ నివేదికను విడుదల చేసింది. 

ఆ నివేదికలో సైతం ఇదే విషయం వెల్లడైంది. అంతేకాదు గృహాల ధరల పెరుగుదలలో హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా 128వ స్థానంలో ఉంది. భారతీయ నగరాల్లో హైదరాబాద్‌ ముందంజలో ఉంది.

ఏడాదిలో భాగ్యనగరిలో ఇళ్ల ధరలు 2.5 శాతం అధికం అయ్యాయి. నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక ప్రకారం.. చెన్నై 131, కోల్‌కత 135, అహ్మదాబాద్‌ 139వ స్థానంలో ఉంది. ఈ మూడు నగరాల్లో ఇళ్ల ధరలు 0.4–2.2 శాతం పెరిగాయి. 

బెంగళూరు 140, ఢిల్లీ 142, పుణే 144, ముంబై 146 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ నగరాల్లో ధరలు 0.2–1.8% తగ్గాయి. జాబితాలో టర్కీలోని ఇజ్మీర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

చదవండి: కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోండి?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top