హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌.. టైమ్‌ అంటే టైమే..! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌.. టైమ్‌ అంటే టైమే..!

Published Wed, Jan 3 2024 7:37 AM

Hyderabad Airport Top On Highest OnTime Performance - Sakshi

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టైమింగ్‌ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్‌టైమ్‌ పర్ఫార్మెన్స్‌-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్‌టైమ్‌ పర్ఫార్మెన్స్‌ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్‌ సంస్థ సిరియమ్‌ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్‌-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది.

టాప్‌ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్‌-సెయింట్‌ పాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది.

ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్‌ మనమే చెక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

సంస్థల వారీగా..

అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్‌ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్‌ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్‌ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్‌ నిప్పాన్‌ ఎయిర్‌వేస్‌ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ (82.58% ఓటీపీ), థాయ్‌ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్‌టైమ్‌ షెడ్యూల్‌ అని సిరియమ్‌ నివేదిక తెలిపింది.

 
Advertisement
 
Advertisement