చెన్నై ‘రామ్‌చరణ్‌’ కంపెనీలోకి భారీ పెట్టుబడులు

Huge Investments Floating Into Ram Charan Co Chemical Distribution Business - Sakshi

41% వాటా టీఎఫ్‌సీసీ చేతికి 

ముంబై: దేశ కెమికల్స్‌ రంగంలోనే అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల ఒప్పందం చోటుచేసుకుంది. చెన్నైకు చెందిన కెమికల్స్‌ డిస్ట్రిబ్యూటర్, స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ కంపెనీ ‘రామ్‌చరణ్‌ కో’లో న్యూయార్క్‌కు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్‌ 46% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకోసం 4.14 బిలియన్‌ డాలర్లను (రూ.31,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయ నుంది. దీంతో రామచరణ్‌ కో 9 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సొంతం చేసుకున్నట్టు అయింది.

వ్యర్థాల నుంచి ఇంధన తయారీ, నూనతతరం ఇంధన స్టోరేజ్‌ పరికరాలను రామచరణ్‌ కంపెనీ తయారు చేస్తోంది. భారత్‌లో పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు, పునరుత్పాదక ఇంధనాలు, తక్కువ వ్యయాలతో కూడిన ఇళ్ల నిర్మాణాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు టీఎఫ్‌సీసీ ప్రకటించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top