Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి

How to reset sbi atm pin details - Sakshi

ఆధునిక ప్రపంచంలో ఆన్‌లైన్ పోర్టల్‌ వినియోగంలోకి వచ్చిన తరువాత మనం చేయాల్సిన పనులు దాదాపు ఇంటి నుంచి చేసేయడానికి వీలుపడుతోంది. ఇందులో భాగంగానే 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాదారులు ఇప్పుడు బ్యాంకుకి వెళ్లకుండానే ఏటీఎమ్ పిన్ మార్చుకోవచ్చు. దీని కోసం ఈ కింది దశలను పాటిస్తే సరిపోతుంది.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్‌ ఓపెన్ చేయండి
  • పర్సనల్ బ్యాంకింగ్ డీటైల్స్‌లో లాగిన్ అవ్వండి
  • ఇ-సర్వీసుకి వెళ్లి ఏటీఎమ్ కార్డ్ సర్వీసు కోసం క్రిందికి స్క్రోల్ చేయండి.
  • డ్రాప్-డౌన్ లిస్ట్ నుంచి కొత్త ఏటీఎమ్ పిన్ జనరేట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
  • కొనసాగడానికి 'Get Authorization PIN' ఆప్షన్ క్లిక్ చేయండి.

  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పొందుతారు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • రీసెట్ చేయాలనుకుంటున్న ఏటీఎమ్ పిన్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి.
  • పిన్ రీసెట్ చేయడానికి కార్డు వివరాలు ఎంచుకోండి.
  • కార్డు వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీకు నచ్చిన, బాగా గుర్తుంచుకోగలిన రెండు అంకెలను ఎంటర్ చేయండి. తరువాత మిగిలిన రెండు అంకెలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తాయి.
  • పిన్ నాలుగు అంకెలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • ప్రక్రియ మొత్తం ముగిసే సమాయానికి ఎస్‌బిఐ మీకు ఒక కన్ఫర్మ్ మెసేజ్ పంపిస్తుంది.

ఎస్‌బిఐ ఏటీఎమ్ పిన్ నెంబర్ మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్ కూడా ఇంటినుంచి అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top