SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!

How to update registered mobile number through net banking and atm - Sakshi

ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుండి మొబైల్ నెంబర్ అప్‌డేట్

ఏటీఎమ్ నుండి మొబైల్ నెంబర్ అప్‌డేట్

ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరూ లావాదేవీలను గురించి తెలుసుకోవడానికి నేరుగా బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌లను వారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాలి, ఇలా చేసుకున్నప్పుడు తమ అకౌంట్ ద్వారా జరిగే అన్ని ట్రాన్సక్షన్స్ గురించి వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుండి మొబైల్ నెంబర్‌ అప్‌డేట్:

  • మొదట www.onlinesbi.com ఓపెన్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి, పేజీ ఎడమ పానెల్‌లో ఉన్న 'మై అకౌంట్' విభాగంలోని ''ప్రొఫైల్ - పర్సనల్ డీటైల్స్ - చేంజ్ మొబైల్ నెంబర్'' ఎంపిక చేసుకోండి.
  • అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, క్రింది స్క్రీన్‌పై సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
  • మీకు రిజిస్టర్డ్ నంబర్ చివరి రెండు అంకెలను కనిపిస్తాయి.
  • మ్యాపింగ్ స్టేటస్ తెలియజేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగపడుతుంది.

ఏటీఎమ్ నుండి మొబైల్ నెంబర్‌ అప్‌డేట్:

  • మీ సమీపంలో ఉన్న SBI ATM వద్దకు వెళ్లి, అందుబాటులో ఉన్న ఎంపికల నుండి రిజిస్టర్ ఎంపికను సెలక్ట్ చేసుకోండి.
  • మీ ఏటీఎమ్ పిన్‌ని టైప్ చేసుకోండి. 
  • తరువాత స్క్రీన్‌పై కనిపించే మెను ఆప్షన్స్ నుండి మొబైల్ నెంబర్ ఎంటర్ ఎంచుకోండి.
  • స్క్రీన్‌పై ఉన్న మెను ఎంపికల నుండి, చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి.
  • గతంలో ఉపయోగిస్తున్న మీ మునుపటి మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేసి ధృవీకరించాలి.
  • తరువాత మీ కొత్త మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి ధృవీకరించమని చెబుతుంది.
  • కొత్త నెంబర్, పాత మొబైల్ నెంబర్ రెండింటికి వేరువేరుగా OTPలు వస్తాయి.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top