ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ ప్లాన్‌: హాస్పిటల్ బిల్‌ ఎన్నిరోజులకు చెల్లిస్తారు!

How Much Time Maternity Insurance Claim Coverage - Sakshi

న్యూఢిల్లీ: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు.. బీమా సంస్థలు సగటున 20 నుంచి 46 రోజుల సమయాన్ని తీసుకుంటున్నట్టు ‘సెక్యూర్‌నౌ’ అనే ప్లాట్‌ఫామ్‌ నిర్వహించిన సర్వేలో తెలిసింది.  

మెజారిటీ పాలసీదారులు తమ ఆస్పత్రిలో చేరిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ విషయాన్ని బీమా సంస్థలకు వెంటనే తెలియజేస్తున్నారు. కానీ, అదే సమయంలో చెల్లింపులు చేసేందుకు అవి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. 

మేటర్నిటీ క్లెయిమ్‌లకు (ప్రసవ సంబంధిత) చెల్లింపులు చేయడానికి 7 నుంచి 108 రోజుల సమయం తీసుకుంటున్నాయి. సిజేరియన్‌ క్లెయిమ్‌ చెల్లింపులకు  9–135 రోజుల సమయం పడుతోంది.  

అతి తక్కువగా కీమోథెరపీకి 12–35 రోజుల్లోపు పరిహారం చెల్లిస్తున్నాయి.  

ఏటా కోటి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు నమోదవుతున్నాయి. 

క్లెయిమ్‌ చేసిన మొత్తంలో 13–26 శాతాన్ని బీమా సంస్థలు కోత పెడుతున్నాయి. కన్జ్యూమబుల్స్, పరిపాలనా చార్జీల కింద ఈ పనిచేస్తు నాయి. వీటికి సాధారణంగా పరిహారం రాదు. 

ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల పరిధిలో ఆస్పత్రిలో చేరే వారి పాలసీదారుల రేటు తక్కువగా ఉంటోంది. దీంతో తక్కువ క్లెయిమ్‌లు రావడం, ఫలితంగా ప్రీమియం రేట్లు తక్కువగా ఉంటున్నాయి  

మరిన్ని వివరాలు వెల్లడించాలి..
‘‘ఆరోగ్యబీమా ఎలా అభివృద్ధి చెందిందన్న దానికి ఇది సంకేతం. క్లెయిమ్‌లకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను బహిరంగ పరచడం తదుపరి అడుగు కావాలి. అప్పుడు క్లెయిమ్‌ల పరిష్కారంలో బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టడానికి వీలుంటుంది’’అని సెక్యూర్‌నౌ సహ వ్యవస్థాపకుడు కపిల్‌ మెహతా పేర్కొన్నారు. 

చదవండి: ఎల్‌ఐసీ బంపరాఫర్‌, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్‌ అస్సలు మిస్‌ చేసుకోవద్దు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top