గూగుల్ మెసేజ్‌ యాప్ లో సాంకేతిక లోపం

How To Fix The SMS Issue on Android Phones - Sakshi

చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎస్ఎంఎస్ యాప్ గురుంచి పిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను మొదటగా ఆండ్రాయిడ్ సెంట్రల్ గుర్తించినట్లుగా తెలుస్తుంది. గూగుల్ యొక్క క్యారియర్ సర్వీసెస్ యాప్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో అప్డేట్ చేసినప్పుడు సమస్య వస్తుందని, ఎస్ఎంఎస్ పంపేటప్పుడు వారు దాదాపు 30 నిముషాల లాగ్స్ ఎదుర్కొంటున్నారని వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సమస్య గురుంచి రెడ్డిట్, ఇతర ఫోరమ్లలో చాలా ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ సమస్యకు సంబంధించి గూగుల్ లేదా స్మార్ట్ఫోన్ తయారీదారుల నుండి ఎటువంటి స్పందన లేదు. (చదవండి: షియోమీ మరో సంచలనం)

మీరు ఈ సమస్య నుండి బయటపడటానికి మీ స్మార్ట్‌ఫోన్ నుండి గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ ని అన్ ‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా తాత్కాలికంగా పరిష్కారం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికోసం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళాక అక్కడ మెను భాగంలో మై యాప్స్, గేమ్స్ ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యాప్స్ లో ఉన్న 'క్యారియర్ సర్వీసెస్'ని 'అన్‌ఇన్‌స్టాల్' చేయండి. మీరు ఒకటి మాత్రం గమనించాలి గూగుల్ క్యారియర్ సేవలను అన్‌ఇన్‌స్టాల్ చేసే ముందు గూగుల్ క్యారియర్ సర్వీసెస్ గూగుల్ మెసేజెస్ యాప్ లో సరికొత్త కమ్యూనికేషన్ సర్వీసెస్, ఫీచర్‌లను ఎనేబుల్ చేస్తుందని అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు యాప్ ని మళ్లీ ఇన్‌స్టాల్ చేయకపోతే మీరు ఏ క్రొత్త ఫీచర్‌లను భవిష్యత్ లో ఉపయోగించలేరు. ఎస్ఎంఎస్ యాప్ లో వచ్చిన సమస్యకు గూగుల్ పరిష్కరిస్తుందో చూడాలి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top