ఉచితంగా 5 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!

How To Download e-Pan card From New Income Tax Website - Sakshi

పర్మినెంట్ అకౌంట్ నెంబరు(పాన్ కార్డు) అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పది అంకెల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ నెంబరు. మన దేశంలో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ పాన్-కార్డు చాలా ముఖ్యమైనది. ఐ-టీ విభాగం జారీ చేసిన లామినేటెడ్ ప్లాస్టిక్ పాన్ కార్డు ఇప్పటి వరకు చాలా ప్రసిద్ధి చెందింది. గతంలో ఈ-పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. అలాగే, అలా దరఖాస్తు చేసుకొన్న తర్వాత నెల రోజులకు గాని పాన్ కార్డు ఇంటికి వచ్చేది కాదు. 

అయితే, ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగానే పాన్ కార్డు పొందొచ్చు. అయితే దీని కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో పాన్ నెంబర్ వచ్చేస్తుంది. దీన్ని ఈ-పాన్ అని పిలుస్తారు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆ తర్వాత జిరాక్స్ చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు, ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఉచితంగానే పాన్ కార్డు వచ్చినట్లు అవుతుంది.

ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!

  • మొదట ఆదాయపు పన్నుశాఖ కొత్త (https://www.incometax.gov.in/iec/foportal) పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు 'Instant E-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత 'Get New e-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీకు ఈ-పాన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

(చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!) 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top