మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?

How to Boost Your Home's Wi Fi - Sakshi

ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో వై-ఫై అంటే తెలియని వాళ్లు చాలా కొద్దీ మాత్రమే ఉంటారు. ప్రస్తుత కరోనా కాలంలో గతంలో వై-ఫై ఉపయోగించని వారు కూడా ఇప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది. దీనికి తోడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని గతం కంటే ఎక్కువగా వై-ఫైలు వాడకం బాగా పెరిగిపోయింది. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వై-ఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రాడ్ బ్యాండ్ ని ఎంచుకొని ఉన్న కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కొంటారు కొందరు. దానికి ప్రధాన కారణం వారు చేసే చిన్న తప్పులే. అయితే ఇప్పుడు మీ వై-ఫై వేగాన్ని పెంచే కొన్ని మార్గాలను మనం తెలుసుకుందాం. (చదవండి: గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!)

వై-ఫై వేగాన్ని పెంచడానికి ఈ టిప్స్ పాటించండి:

  • మొదటగా మీరు మీ ఇంట్లో వై-ఫై అవసరం లేకపోయినా దానికి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగా డిస్ కనెక్ట్ చేయండి.
  • కొన్ని సార్లు మీరు వై-ఫై రూటర్ ప్రక్కన నిలబడితే మాత్రమే వై-ఫై సిగ్నల్ వస్తుంటే ముందుగా మీ వై-ఫై రూటర్ స్థానాన్ని మార్చండి. అది కూడా మీ గదిలో మధ్యలో ఉండే విదంగా చూసుకోండి. అలాగే దాని పక్కన ఎలాంటి ఎలక్ట్రానిక్, ఐరన్ వంటివి లేకుండా చూసుకోండి. 
  • అలాగే ముందుగా మీ ఇంటి యొక్క అవసరాలను గుర్తించండి. చాలా మంది వారి ఇంటిలో ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న తక్కువ స్పీడ్ గల వై-ఫై కనెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. దీని వల్ల కొన్ని సార్లు మనకు అత్యవసర సమయంలో వై-ఫై సిగ్నల్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ 2.4గిగాహెర్ట్జ్ నుంచి 5గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్ ని మీ అవసరాని బట్టి ఎంచుకోవాలి.
  • మీ వై-ఫై వేగాన్ని పరిశీలించండి. ఒక్కోసారి మీరు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఏదైనా సమస్యలు ఉంటే తక్కువ స్పీడ్ వచ్చే అవకాశం ఉంది. ఇతర పరికరాలలో కూడా ఒక సారి వైఫై వేగాన్ని కొలవండి. దీని కోసం fast.com ను ఉపయోగించవచ్చు. ఒకవేల ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే ముందుగా మీ పరికరంలో నెట్ వర్క్ సెట్టింగ్స్ చేయండి.
  • మీరు ఎక్కువ మంది నివసించే ప్రాంతాలలో ఉంటే మాత్రం ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్ మీకు కనెక్ట్ కావడానికి మీ రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన ఛానెల్ ని మీరు స్వయంగా ఎంచుకోవచ్చు.
  • కొన్ని సార్లు వై-ఫై తగ్గిపోవడానికి రూటర్ యాంటెన్నా కూడా కారణం కావచ్చు. అందుకని ఒకసారి మీ రూటర్ యాంటెన్నాల పోజిషన్ ను మార్చి చూడండి.
  • అలాగే, ఒకసారి వై-ఫై రూటర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి.
  • ఇప్పటికి కూడా మీ వై-ఫై వేగం పెరగకపోతే రూటర్ లేదా వై-ఫై కనెక్షన్ సేవలను మార్చి చూడండి. అంటే వేరే రూటర్ తీసుకోవడం లేదా వేరే వైఫై కనెక్షన్ తీసుకోవడం మంచిది.  
     
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top