ఏటీఎం కార్డు లాంటి ఆధార్.. అప్లై ఇలా!

How To Apply PVC Aadhar Card Online in Telugu - Sakshi

ఆధార్ కార్డుకు కొత్త రూపునిస్తోంది యూఐడీఏఐ. 2021లో సరికొత్తగా పీవీసీ ఆధార్​ను ప్రవేశపెట్టింది. ఇది వరకు ప్రింట్ వెర్షన్​లో 'పేపర్' ఆధార్ కార్డు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్​లను జారీ చేయనుంది. కేవలం రూ.50 చెల్లించి ఈ పీవీసీ కార్డును పొందవచ్చు. కార్డులో పేర్కొన్న ఇంటి వద్దకే పీవీసీ ఆధార్​ కార్డును డెలివరీ చేయనుంది. అయితే, దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: గూగుల్‌ పేలో ఆ సేవలు కష్టమే..!)

పీవీసీ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం.

  • యూఐడీఏఐ వెబ్​సైట్​(https://myaadhaar.uidai.gov.in/)కి వెళ్లి లాగిన్ అవ్వండి
  • 'ఆర్డర్​ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. 
  • ఆ తర్వాత రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. 
  • ఆధార్​ కార్డులో ఉన్న అడ్రెస్​కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top