హోండా ఈవీ స్కూటర్‌ వచ్చేస్తోంది.. యాక్టివాకంటే తక్కువ ధరలో

Honda first electric scooter India will be cheaper than petrol Activa: President of HMSI - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు,హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది. యాక్టివా కంటే తక్కువ ధరతో హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుండటం విశేషం. సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం   ఎదురుచూస్తున్న కస్టమర్లే లక్క్ష్యంగా  దీన్ని లాంచ్‌ చేయనుంది.  (డిష్‌ టీవీ ఛైర్మన్‌ బై..బై! షేర్లు రయ్‌ రయ్‌..!)

తాజా నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్‌తో నడిచే ప్రస్తుత తరం యాక్టివా కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధిని కంపెనీ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా వెల్లడించారు. స్థానిక మార్కెట్ నుండి విడిభాగాలను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను తక్కువగా అందించనుందట.అయితే  ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల, రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీని మార్చుకునే సదుపాయంతో వివిధ మోడళ్లలో తీసుకురానుందని అంచనా. రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో  లాంచ్‌ చేస్తుంది. (ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్‌ సప్లైకు ఎదురు దెబ్బ)

దశాబ్దం చివరి నాటికి ఈ విభాగంలో 30శాతం వాటానుటార్గెట్‌గా పెట్టుంది.  అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గరిష్టంగా గంటకు 60 కి.మీ. మించదట. అలాగే 72,000-75,000 (ఎక్స్-షోరూమ్)  మధ్య ఉంటుందని అంచనా. కాగా ప్రస్తుతం, ఎలక్ట్రిక్ టూ వీలర్ స్పేస్‌లో కేవలం బజాజ్ ఆటో, టీవీఎస్‌ మోటార్స్ టూ వీలర్ బ్రాండ్‌లు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటితోపాటు ఒకినావా, అథర్ ,ఓలా వంటి స్టార్టప్‌లు  తమ హవాను చాటుకుంటున్నాయి.  తాజా హోండా కూడా ఎంట్రీ  ఇస్తుండటంతో మారుతి సుజుకీ సహా దాదాపు అన్నీకంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేయనున్నాయి. ఇటీవల యమహా ఇండియాఎలక్ట్రిక్ స్కూటర్‌లపై పని చేస్తున్నట్లు ప్రణాళికలను ధృవీకరించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top