హోండా బంపరాఫర్‌..! ఆ బైక్‌పై ఏకంగా రూ. 10 లక్షల తగ్గింపు..!

Honda cbr1000rr-R Fireblade Price Cut Massively by Rs 10 Lakh - Sakshi

స్పోర్ట్స్‌ బైక్‌ ప్రియులకు  ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం హోండా బంపరాఫర్‌ను ప్రకటించింది. హోండా పోర్ట్‌ఫోలియోలోని ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ ధరలను గణనీయంగా తగ్గించింది. 

2020లో హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్-2020 బైక్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.  హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ లాంచ్‌ ధర రూ. 32.68 (ఎక్స్-షోరూమ్ ధర) లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌పై  ప్రకటించిన తగ్గింపుతో ఇప్పుడు హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ బైక్‌ రూ. 23.11 లక్షలకు రిటైల్‌ కానుంది.

దాదాపు రూ. 10 లక్షల తగ్గింపును హోండా ప్రకటించింది. ధర తగ్గింపుపై హోండా ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ అధికారిక బిగ్‌వింగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ బైక్‌ కొత్త ధరతో కన్పిస్తోంది. 

హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ బైక్‌ రెండు కలర్‌ వేరియంట్లలో రానుంది. బ్లాక్‌, రెడ్‌ కలర్‌ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ అత్యంత శక్తివంతమైన ఫైర్‌బ్లేడ్‌ బైక్‌ నిలుస్తోంది. ఈ బైక్‌లో 1000cc, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, DOHC, ఇన్‌లైన్-4 సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. హోండా  CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ 14,500 RPM వద్ద 214.5 hp గరిష్ట శక్తిని, 12,500 RPM వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది హోండాకు చెందిన సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)ని కూడా పొందుతుంది.

చదవండి: హల్‌చల్‌ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్‌ నయా మోడల్‌..! ధర ఎంతంటే..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top