Honda CB650R Price in India, Check out For Features - Sakshi
Sakshi News home page

హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే

Mar 31 2021 11:09 AM | Updated on Mar 31 2021 12:25 PM

Honda CB650R launched in India at Rs 8.67 lakh - Sakshi

సాక్షి,  ముంబై: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా మంగళవారం రెండు ప్రీమియం బైకులను భారత మార్కెట్లో విడుల చేసింది. ఇందులో ఒకటి సీబీఆర్‌650ఆర్‌ కాగా, మరోకటి సీబీ650ఆర్‌ బైక్‌. ఇది 649 సీసీ మోటర్‌ సైకిల్‌ అప్‌డేట్‌ ఎడిషన్‌గా వస్తుంది. ఈ బైకుల ధరలు వరుసగా రూ.8.88 లక్షలు, రూ.8.67 లక్షలుగా ఉన్నాయి. వీటిని విదేశాల నుంచి కంప్లీట్లీ నాక్డ్‌ డౌన్‌ యూనిట్‌ (సీకేబీ) రూపంలో దిగుమతి చేసుకుంటామని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో ప్రీమియం మోటర్‌సైకిళ్ల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ బైకులను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

హైదరాబాద్  సహా, గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), కొచ్చి (కేరళ)లోని  బిగ్ వింగ్ టాప్ లైన్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్‌ప్రారంభం. 


 

Advertisement
 
Advertisement
Advertisement