డిస్క్‌ బ్రేక్‌తో స్ల్పెండర్‌ ప్లస్‌ | Hero Splendor Plus updated with front disc brake option | Sakshi
Sakshi News home page

డిస్క్‌ బ్రేక్‌తో స్ల్పెండర్‌ ప్లస్‌

Apr 13 2025 2:50 PM | Updated on Apr 13 2025 3:11 PM

Hero Splendor Plus updated with front disc brake option

ప్రముఖ టూవీలర్‌ విక్రయ సంస్థ హీరో స్ల్పెండర్ ప్లస్ మోడల్‌లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఈ బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెసులుబాటును అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది బైక్‌ భద్రత, బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పింది. ఈ ఫీచర్ స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్‌ వేరియంట్‌లో తీసుకురాబోతున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో ఫుల్‌ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌ వస్తాయని చెప్పాయి.

ఇదీ చదవండి: కొత్తగా 34 బ్యాంకింగ్‌ సర్వీసులు ప్రారంభం

పట్టణ రవాణా పరిస్థితుల్లో డిస్క్ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఎంతో అవసరమని భావించి ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బైక్‌లో మెరుగైన బ్రేకింగ్‌ నియంత్రణ కోసం 240 మిమీ ఫ్రంట్ డిస్క్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. వెనుక భాగంలో ప్రస్తుతం ఉన్నట్లుగానే డ్రమ్ బ్రేక్ సెటప్‌ ఉంటుందని తెలిపారు. ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.02 పీఎస్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్‌ వేరియంట్ ధర రూ.83,461 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement