breaking news
disk
-
డిస్క్ బ్రేక్‌తో స్ల్పెండర్ ప్లస్
ప్రముఖ టూవీలర్ విక్రయ సంస్థ హీరో స్ల్పెండర్ ప్లస్ మోడల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఈ బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెసులుబాటును అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది బైక్ భద్రత, బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పింది. ఈ ఫీచర్ స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ వేరియంట్లో తీసుకురాబోతున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో ఫుల్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వస్తాయని చెప్పాయి.ఇదీ చదవండి: కొత్తగా 34 బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభంపట్టణ రవాణా పరిస్థితుల్లో డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఎంతో అవసరమని భావించి ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బైక్‌లో మెరుగైన బ్రేకింగ్ నియంత్రణ కోసం 240 మిమీ ఫ్రంట్ డిస్క్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. వెనుక భాగంలో ప్రస్తుతం ఉన్నట్లుగానే డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుందని తెలిపారు. ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.02 పీఎస్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ వేరియంట్ ధర రూ.83,461 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. -
ట్విన్ డిస్క్ బ్రేక్స్‌తో బజాజ్ ‘పల్సర్ 150’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ ‘పల్సర్ 150’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ట్విన్ డిస్క్ బ్రేక్స్, షార్పర్ డిజైన్, కొత్త కలర్ స్కీమ్స్, స్లి్పట్ సీట్స్, లాంగర్ వీల్ బేస్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.78,016 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ప్రస్తుత సింగిల్ డిస్క్ మోడల్‌కు తాజా వెర్షన్ అదనంగా కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కం పెనీ తెలిపింది. ట్విన్ డిస్క్ బ్రేక్స్ పల్సర్ 150 ప్రధానంగా బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ క్రోమ్ అనే మూడు డ్యూయెల్ టోన్ రంగుల్లో లభ్యమౌతుందని పేర్కొంది. ఇంజిన్, చాసిస్ టచ్పాయింట్ల ఆప్టిమైజేషన్‌తో నాయిస్, వైబ్రేషన్ అండ్ షార్‡్షనెస్ (ఎన్వీహెచ్)లో మెరుగుదల తీసుకువచ్చామని తెలిపింది. పనితీరు, మైలేజ్ వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చే యువకులు లక్ష్యంగా ఈ బైక్‌ను రూపొందించినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. -
సయాటిక
ప్రస్తుతం మానవ జీవితం యాంత్రికంగా మారింది. ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్నవిపర్యయం (పగటి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాల్లో మార్పులు రావటం వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలతో వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యమైంది కటిశూల (నడుమునొప్పి). 90 శాతం మంది తమ జీవితకాలంలో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుశ్రుత, బాగ్బటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటిక)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. సాధారణ కారణాలు పరిశీలిస్తే.. ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చోవటం, స్థూలకా యం, అధిక శ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయడం, అధిక బరువులను మోయటం, ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, రోడ్డు ప్రమాదాల వల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది. ఈ కారణాల వల్ల శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్దత, నొప్పి కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే సయాటిక (గుద్రసీవాతము) అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువవుతుంది. నడుముకు సంబంధించిన ఎల్4, ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూస మధ్యగల సయాటిక అనే నరంపై ఒత్తిడి పడటంవల్ల నొప్పి వస్తుంది. డిస్క్‌లో మార్పులు: ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో మార్పులొస్తాయి. డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగి పోవటం వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్‌లో వాపు వస్తే దాన్లో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంటలతో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనదైతే స్పర్శ హాని కూడా కలగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుం టారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. ఆయుర్వేద చికిత్స: ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స, 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధచికిత్స ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: దీనివల్ల ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగబెట్టవచ్చు. ఆయుర్వేదంలో పంచకర్మ ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. జాగ్రత్తలు: సరైన పోషకాహారం తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు. డాక్టర్ మనోహర్. ఎం.డీ ఆయర్వేద. స్టార్ ఆయుర్వేద ఫోన్.7416102102 www.starayurveda.com