Hero MotoCorp appoints Niranjan Gupta as new CEO - Sakshi
Sakshi News home page

హీరో మోటోకార్ప్‌ కొత్త సీఈవో ఎవరో తెలుసా?

Mar 31 2023 3:00 PM | Updated on Mar 31 2023 3:29 PM

Hero MotoCorp appoints Niranjan Gupta as CEO - Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ స్కూటర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సీఈవోను ప్రటించింది. ప్రస్తుతం సీఎఫ్‌వోగా ఉన్న నిరంజన్ గుప్తాకు  ప్రమోషన్‌ ఇచ్చి మరీ  సీఈవోగా నియమించింది. గుప్తా నియామకం  2023 మే 1వ  తేదీ నుండి  బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది.  అయితే కొత్త సీఎఫ్‌వో ఎవరుఅనేది ఇంకా ప్రకటించలేదు. 

(ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్‌, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్‌ ఆఫర్లు)
 
ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, హార్లే డేవిడ్‌సన్, జీరో మోటార్‌సైకిల్స్ వంటి గ్లోబల్ బ్రాండ్‌లతో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంలో నిరంజన్ కీలక పాత్ర పోషించారు. గుప్తా ఏథర్ ఎనర్జీ, హెచ్‌ఎంసిఎల్ కొలంబియా, హెచ్‌ఎంసి ఎంఎం ఆటో ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు.

నిరంజన్‌ హీరో మోటోకార్ప్‌లో చేరడానికి ముందు మూడేళ్లు వేదాంతలో, 20 సంవత్సరాలు యూనిలీవర్‌లో పనిచేశారు. గుప్తా సీఈవోగా ఎదగడంపై హీరో మోటోకార్ప్ఎగ్జిక్యూటివ్ చైర్మన్  హోల్ టైమ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ సంతోషంప్రకటించారు. కాగా బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పవన్ ముంజాల్ కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement