ఇంట్లో 24 గంటలు.. ఆఫీసుల్లో కొన్ని గంటలకే కదా!

Harsh Goenka Latest Tweet Leads Discussion On Work From Home - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: కోల్‌కతా బేస్డ్‌ ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. వర్క్‌ఫ్రం బెటరా ? లేక ఆఫీస్‌ నుంచి పని బెటరా అని అర్థం వచ్చేలా గ్రాఫ్‌లతో కూడిన ఫోటోలను షేర్‌ చేశారు. బిజినెస్‌ టైకూన్‌ సంధించిన ఈ ప్రశ్నకు ఉద్యోగులు వేల సంఖ్యలో స్పందిస్తున్నారు.

ఏది బెటర్‌
కోవిడ్‌ తీవ్రత తగ్గిపోవడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమంగా ఊపందుకోవడంతో అనేక కంపెనీలు తిరిగి ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌కు రావాలంటూ ఉద్యోగులకు సూచించగా మరికొన్ని కంపెనీలు వర్క్‌ఫ్రం హోం గడువు పెంచాయి. ఎక్కువ శాతం కంపెనీలు ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేసుకునేలా హైబ్రిడ్‌ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. మొత్తంగా ఐటీ, మీడియా, బిజినెస్‌ సెక్టార్‌లో వర్క్‌ఫ్రం హోం అనే అంశంపై చర్చ బాగా జరుగుతోంది.

అమ్మో ! వర్క్‌ఫ్రం హోం 
ఆనంద్‌ మహీంద్రా తరహాలోనే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హర్ష్‌ గోయెంకా వర్క్‌ఫ్రం హోం, ఆఫీస్‌ వర్క్‌పై ట్వీట్‌ వదిలారు. ఇందులో ఆఫీస్‌ వర్క్‌ అయితే ట్రాఫిక్‌లో ఎంత సేపు ఉంటాం, కో వర్కర్లతో ముచ్చట్లు, లంచ్‌టైం, టీ టైంలో ఎంత సేపు ఉంటమనే విషయాలు గ్రాఫ్‌లో చెప్పారు. ఈ పనులన్నీ పోను ఆఫీసులో​ పని చేసేది చాలా తక్కువ సమయం అన్నట్టుగా ఫోటో పెట్టారు. అదే వర్క్‌ఫ్రం హోం అయితే వర్క్‌ తప్ప మరేం ఉండదంటూ చమత్కరించారు. మరికొందరు వర్క్‌ఫ్రం హోంలో వర్క్‌ మాత్రమే ఉంటున్నా అది కేవలం ఆఫీస్‌ పని ఒక్కటే కాదని, ఇంటి పనులు, సినిమాలు చూడటం వంటి పనులు కూడా ఉంటున్నాయన్నారు. వర్క్‌ఫ్రం హోంతో ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఆఫీసే బెటర్‌
హార్స్‌ గోయెంకా ఈ ట్వీట్‌ చేయడం ఆలస్యం నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇప్పటికే ఆఫీసులు ఓపెన్‌ చేయాలంటూ హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నా మా విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. వర్క్‌ఫ్రం హోంలో వర్క్‌లోడ్‌ ఎక్కువైపోయిందనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అయ్యాయి. మరికొందరు ఆఫీస్‌లో పని ముగిస్తే పర్సనల్‌ లైఫ్‌ ఉంటుందని, కానీ వర్క్‌ఫ్రం హోంలో 24 గంటలు ఆఫీస్‌ పనే అవుతోందంటూ ట్వీట్‌ చేశారు. మొత్తం మీద వర్క్‌ఫ్రం హోం కంటే ఆఫీస్‌ పనే బాగుందంటూ దానికి తగ్గట్టుగా ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top