Cyber War: సొంత దేశంలోనే వ్లాదిమిర్ పుతిన్‌కు చుక్కలు చూపిస్తున్నారు!!ఉక్రెయిన్ జోలికెళ్తే అంతే!

Hackers Group Anonymous Declares Cyber War In Russia - Sakshi

ఉక్రెయిన్ జోలికొస్తే ర‌ష్యాను అది చేస్తాం. ఇది చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కానీ జో బైడెన్ హెచ్చ‌రిక‌లు మాట‌ల వ‌రికే ప‌రిమితం కావ‌డంతో ఉక్రెయన్ మ‌ద్ద‌తుగా ర‌ష్య‌న్ హ్యాక‌ర్లు రంగంలోకి దిగారు. సొంత దేశంపై అనానమ‌స్ పేరిట సైబ‌ర్ యుద్ధం ప్ర‌క‌టించి ఆదేశాధ్య‌క్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు చుక్కలు చూపిస్తున్నారు.    

అంతర్జాతీయ మీడియా ప్రకారం..రష్యా ప్ర‌భుత్వానికి చెందిన వెబ్‌సైట్‌ల‌ను హ్యాకింగ్ చేయ‌డం ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే  రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అంతర్జాతీయ టెలివిజన్ నెట్‌వర్క్‌ను హ్యాక‌ర్లు త‌మ స్వాధీనం చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై చేస్తున్న ర‌ష్యా దాడికి నిర‌స‌న‌గా విదేశీ ప్రభుత్వ ఖాతాలను యాక్సెస్ చేయడంలో కీరోల్ ప్లే చేసిన అనాన‌మ‌స్ హ్యాక‌ర్స్ గ్రూప్ రష్యాపై సైబర్‌వార్ చేస్తున్న‌ట్లు హెచ్చ‌రించింది.  

హెచ్చ‌రిక‌లు జారీచేసిన కొద్ది నిమిషాల్లోనే రష్యా ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, క్రెమ్లిన్, డూమా, రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీల‌క వెబ్‌సైట్ లు హ్యాకింగ్‌కు గుర‌య్యాయి. దీంతో ర‌ష్యా ప్ర‌భుత్వ కార్యకాల‌పాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.  అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి చెందిన సైబ‌ర్ నిపుణులు.. హ్యాకింగ్ ను ఛేదిస్తున్నారు. హ్యాకర్లు  చేస్తున్న సైబ‌ర్ దాడుల‌తో  వెబ్‌సైట్‌లు నెమ్మదించాయని, సోషల్ మీడియా నెట్‌వర్క్ లు సైతం స్తంభించాయని యూజ‌ర్లు తెలిపారు. 

రాత్రి నుంచి కొన‌సాగుతున్న విధ్వంసం
ఉక్రెయిన్ ఆక్ర‌మ‌ణే ల‌క్ష్యంగా ర‌ష్యా దండ‌యాత్ర కొన‌సాగుతుంది. యుద్ధ‌విమానాలు, క్షిప‌ణులతో ర‌ష్యా ఆర్మీ విరుచుకుప‌డుతోంది. మెలిటోపోల్ న‌గ‌రాన్ని త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్న ర‌ష్య‌న్ ద‌ళాలు ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రంపై ప‌ట్టు సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. కీవ్ సిటీపై రెండు మిసైల్ దాడులు జ‌రుగాయి. కీల‌క ఆర్మీ బేస్డ్ క్యాంప్ పైన ర‌ష్యా బ‌ల‌గాలు దాడులు చేస్తున్నాయి. ర‌ష్యా దాడుల్ని ఉక్రెయిన్ బ‌ల‌గాలు తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తున్నాయి. రాత్రి నుంచి జ‌రుగుతున్న విధ్వంసంలో ఇప్ప‌టి వ‌ర‌కు 38పౌరులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top