స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు అలర్ట్‌...! ఈ లింకుల పట్ల జాగ్రత్త..! లేకపోతే..

Hackers Are Abusing Google Docs To Send Malicious Links - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు అలర్ట్‌..! గూగుల్‌ డాక్యుమెంట్స్‌,గూగుల్‌ స్లైడ్స్‌ ద్వారా హానికరమైన లింక్‌లతో వ్యక్తిగత డేటాను సేకరించి, బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తూన్నట్లు అమెరికన్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. 

ఎక్కువగా వారే..!
స్మార్ట్‌ఫోన్‌  యూజర్లకు హ్యాకర్లు హానికరమైన లింక్‌లను  పంపుతున్నట్లుగా..అందులో ఎక్కువ ఔట్‌లుక్‌ యూజర్లు ఉన్నట్లుగా యూఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అవనన్ తెలిపింది. సెక్యూరిటీ టూల్స్‌ను కూడా తప్పించుకుని గూగుల్‌ డాక్యుమెంట్స్‌, సైడ్స్‌ ద్వారా యూజర్లకు హానికరమైన లింక్‌లను పంపుతున్నట్లు అవనన్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ దాడులపై గత ఏడాది జూన్‌లోనే అవనన్‌ నివేదించింది.

ఆయా లింక్స్‌తో ఫిషింగ్‌ వెబ్‌సైట్ల సహాయంతో వ్యక్తిగత వివరాలను, బ్యాంకు అకౌంట్‌ వివరాలను హ్యకర్లు సంపాదిస్తున్నారని అవనన్‌ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్ 2021 నుంచి ఔట్‌లుక్‌ యూజర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరస్తులు ఎక్కువగా దాడిచేస్తున్నట్లు అవనన్‌ రీసెర్చర్‌ జెరెమీ ఫుచ్స్ చెప్పారు.  ఈ రకమైన దాడులపై అవనన్‌ జనవరి 3 న గూగుల్‌కు కూడా నివేదించింది. ఈ నివేదికపై గూగుల్ ఇంకా స్పందించలేదు. అంతేకాకుండా ఈ సమస్యకు  గూగుల్‌ ఇంకా పరిష్కరం చూపలేదని తెలుస్తోంది.

ఇలా చేస్తే బెటర్‌..! 
ఆయా యూజర్లకు వచ్చే గూగుల్‌ డాక్స్‌, సైడ్స్‌ లింక్స్‌ పట్ల జాగ్రత్త వహించాలని అవనన్‌ పేర్కొంది. హ్యకర్లు పంపే ఈమెయిల్‌ చిరునామాలను క్రాస్‌ చెక్‌ చేయాలని తెలిపింది. గూగుల్‌ డాక్స్‌లో పంపే లింక్‌లను అసలు ఒపెన్‌ చేయకూడదని హెచ్చరించింది. 

చదవండి: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! వెంటనే ఇలా చేస్తే మేలు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top