
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.2,395 కోట్ల నుంచి రూ.154 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.182 కోట్ల నుంచి రూ.840 కోట్లకు పెరిగాయి. టర్నోవర్ రూ.94 కోట్ల నుంచి రూ.1,012 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో జీవీకే పవర్ షేరు ధర శుక్రవారం 1.43% పెరిగి రూ.2.84 వద్ద స్థిరపడింది.