breaking news
GVK Power and Infra
-
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాపై దివాలా చర్యలు
ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆదేశం మొత్తం బకాయిలు రూ.15,576 కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ చెల్లింపుల్లో విఫలమైనందున జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్)పై దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ ఆదేశాలు ఇచి్చంది. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని జీవీకేపీఐఎల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఫైలింగ్ ప్రకారం సతీష్ కుమార్ గుప్తాను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా (ఐఆర్పీ) ఎన్సీఎల్టీ నియమించింది. గ్యారెంటర్‌గా ఉన్నందుకే.. వాస్తవానికి ఈ రుణాన్ని దశాబ్దం క్రితం జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్ పొందింది,. దీనికి జీవీకేపీఐఎల్ గ్యారెంటర్‌గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 2022లో పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై దివాలా చర్యలకు ఆదేశిస్తూ జూలై 12న ఎన్సీఎల్టీ బెంచ్ ఆదేశాలు జారీచేస్తే, ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచి్చంది. 1.84 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ‘‘కార్పొరేట్ రుణగ్రహీత తన రుణ బాధ్యతలను అంగీకరించారు. 2018–19, 2019–20, 2020 –21 ఆర్థిక సంవత్సరాల వార్షిక నివేదికలలో ఈ విషయాన్ని అంగీకరించారు. జూన్ 13, 2022 నాటికి రుణగ్రహీత 1.84 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. చెల్లించాల్సిన మొత్తంలో 1.13 బిలియన్ డాలర్లు అసలు, 731.57 మిలియన్ డాలర్లు వడ్డీ, 1,44,000 డాలర్ల ఏజెన్సీ ఫీజు ఉన్నాయి’’(ఉత్తర్వు ప్రకారం రూ. 9,463 కోట్లు అసలు, రూ. 6,113 కోట్లు వడ్డీ, రూ. 1.23 కోట్ల ఏజెన్సీ ఫీజులు) అని ఎన్సీఎల్టీ ఉత్తర్వు పేర్కొన్నట్లు జీవీకేపీఐఎల్ తెలిపింది. మొదటి డిఫాల్ట్ 2017 ఫిబ్రవరి.. ఐసీఐసీఐ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది కే. వివేక్ రెడ్డి వాదనల ప్రకారం, మొదటి డిఫాల్ట్ ఫిబ్రవరి 2017లో సంభవించింది. అప్పటి నుంచి రుణ చెల్లింపులు జరగలేదు. జీవీకే కోల్ తీసుకున్న రుణానికి జీవీకేపీఎల్ బాధ్యత వహిస్తుంది. తొలుత ఈ కేసులో విచారణ జరిపిన లండన్ కోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. జీవీకే చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి చర్య అవుతుంది. ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకు రుణం ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకుగాను జీవీకే కోల్‌కు సెప్టెంబరు 2011లో ఐసీఐసీఐ బ్యాంక్ (దుబాయ్, బహ్రెయిన్, సింగపూర్ శాఖ లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రస్ అల్ ఖైమా), బ్యాంక్ ఆఫ్ ఇండియా (లండన్, సింగపూర్), కెనరా బ్యాంక్ (లండన్) రూ.8,356 కోట్ల టర్మ్ లోన్, అలాగే రూ.292 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను మంజూరు చేశాయి. ఇతర బ్యాంకులు 367 కోట్ల రూపాయల అదనపు టర్మ్ లోన్లను మార్చి 2014లో మంజూరు చేశాయి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 2,089 కోట్ల రూపాయలకు పెంచాయి.విచారణాంశాలు.. రుణ మంజూరు సమయంలో చేసుకున్న అవగాహనలను ఉల్లంఘిస్తూ, రుణదాత అనుమతి లేకుండానే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో జీవీకే గ్రూప్ తన వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు మార్చి 2016లో ఐసీఐసీఐ బ్యాంక్ గుర్తించింది. దీనితో బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే తన వాటాను విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 2016లో లండన్ కోర్టులో బ్యాంకులు ఇంజక్షన్ దావా వేశాయి. రుణం చెల్లించని కారణంగా, ఫెసిలిటీ అగ్రిమెంట్–1 కింద రూ. 5,915 కోట్లు, ఫెసిలిటీ అగ్రిమెంట్–2 కింద రూ. 1,236 కోట్ల కోసం బ్యాంకులు లండన్ కోర్టులో క్లెయిమ్ పిటిషన్లు వేశాయి. అసలు, వడ్డీకి సంబంధించి రూ. 5,000 కోట్లను డిమాండ్ చేస్తూ 2020 నవంబర్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన కార్పొరేట్ గ్యారెంటీ అమలుకు చర్యలు తీసుకుంది. రుణ చెల్లింపుల్లో తన వైఫల్యాన్ని అంగీకరించిన జీవీకేపీఐఎల్, రుణ చెల్లింపులకు కట్టుబడి ఉన్నానని అప్పటి వరకూ చర్యను నిలుపుచేయాలని బ్యాంకర్లను కోరింది. ముంబై జీవీకే ఎయిర్పోర్ట్ కొనుగోలు విషయంలో అదానీ గ్రూప్‌తో ఒక పరిష్కారానికి వచి్చన తరువాత రుణ చెల్లింపులు జరుపుతామని హామీ ఇచి్చంది. అయితే రుణ చెల్లింపులకు చర్యలు కనిపించకపోవడంతో బకాయిల కోసం 2022లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్సీఎల్టీ, హైదరాబాద్ బెంచ్‌ని ఆశ్రయించింది. -
భారీగా తగ్గిన జీవీకే పవర్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.2,395 కోట్ల నుంచి రూ.154 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.182 కోట్ల నుంచి రూ.840 కోట్లకు పెరిగాయి. టర్నోవర్ రూ.94 కోట్ల నుంచి రూ.1,012 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో జీవీకే పవర్ షేరు ధర శుక్రవారం 1.43% పెరిగి రూ.2.84 వద్ద స్థిరపడింది. -
పార్లమెంటు ప్రతిష్టంభనపై కదిలిన కార్పొరేట్లు
కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుతూ ఆన్లైన్ పిటీషన్ న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొనడంపై కార్పొరేట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరుతూ భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఆన్లైన్ పిటీషన్ రూపొందించింది. రాహుల్ బజాజ్, ఆది గోద్రెజ్, కిరణ్ మజుందార్-షా తదితర పారిశ్రామిక దిగ్గజాలు సహా 17,000 మంది దీనిపై సంతకాలు చేశారు. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా వైస్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, హీరో గ్రూప్‌నకు చెందిన సునీల్ కాంత్ ముంజల్ .. పవన్ ముంజల్, పుంజ్ లాయిడ్ చైర్మన్ అతుల్ పుంజ్ మొదలైన వారు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. పార్లమెంటు సక్రమంగా నడవకపోతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుందని సీఐఐ పేర్కొంది. ఇటీవలి పరిణామాలు ఆవేదన కలిగించేవిగా ఉన్నాయని, పార్లమెంటుపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అటు అధికార పక్షం, ఇటు విపక్షం రెండూ కూడా కీలకమైనవేనని, రాజకీయాంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండింటిపైనా ఉందని తెలిపింది.