బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..!

Govt Plans to Merge Bbnl With Bsnl This Month - Sakshi

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)లో మరో ప్రభుత్వ రంగ సంస్థ  భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీబీఎన్‌ఎల్‌)ను పూర్తిగా వీలినం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలలో వీలిన ప్రక్రియ పూర్తిగా ముగుస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మాట్లాడుతూ...బీబీఎన్‌ఎల్‌ వీలిన ప్రక్రియతో బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఒక మలుపు తిప్పే అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. బీబీఎన్‌ఎల్‌ పూర్తి బాధ్యతలు బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిధిలోకి వస్తాయని తెలిపారు.

ప్రైవేట్‌కు ధీటుగా..!
ఇప్పటికే పలు దిగ్గజ ప్రైవేట్‌ టెలికాం సంస్థలు మొబైల్‌ నెట్‌వర్క్‌తో పాటుగా బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అందిస్తున్నాయి. బీబీఎన్‌ఎల్‌ వీలిన ప్రక్రియతో బ్రాడ్‌బ్యాండ్‌ సెగ్మెంట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీగా లబ్థి చేకూరే అవకాశం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 

భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌..!
బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చింది. 2021 జూలైలో దేశ వ్యాప్తంగా 6 లక్షల గ్రామాలకు ఆప్టిక్‌ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఈ ప్రాజెక్ట్‌ అమలు బాధ్యతను పూర్తిగా బీబీఎన్‌ఎల్‌ చూసుకునేది. అందుకోసం సుమారు రూ. 24 వేల కోట్లను వెచ్చించారు. దేశంలోని 2.5 లక్షల  గ్రామ పంచాయతీల్లో 1.71 లక్షల గ్రామ పంచాయతీలను భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ కింద అనుసంధానం చేశారు. 

చదవండి: క్రిప్టోకరెన్సీలపై కేంద్రం కీలక నిర్ణయం..! వాటి పరిధిలోకి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top