గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు అలర్ట్‌..! కేంద్రం హెచ్చరికలు..!

Govt Issues Security Warning for Google Chrome Microsoft Edge - Sakshi

కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-In) గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. ఈ బ్రౌజర్స్‌లో లోపాలున్నట్లుగా గుర్తించింది.  

గూగుల్‌ క్రోమ్‌లో లోపాలు..!
గూగుల్‌ క్రోమ్‌ 99.0.4844.74 వెర్షన్‌ కంటే ముందు బ్రౌజర్‌ను వాడుతున్నవారికి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్స్‌ను వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా అపరేట్‌ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్‌ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్‌-ఇన్‌ హెచ్చరించింది. సెర్ట్‌-ఇన్‌ హెచ్చరికల ప్రకారం... బ్లింక్ లేఅవుట్, ఎక్స్‌టెన్షన్స్‌, సేఫ్‌ బ్రౌజింగ్, స్ప్లిట్‌స్క్రీన్, ఆంగిల్, న్యూ ట్యాబ్ పేజీ, బ్రౌజర్ UI, GPUలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో వంటి లోపాలున్నట్లు పేర్కొంది. 

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్
గూగుల్ క్రోమ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో కూడా భద్రతా లోపాలున్నట్లు CERT-In నివేదించింది.  యాంగిల్‌ ఇన్‌ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, కాస్ట్‌ యూఐ ఇన్‌ ఫ్రీ యూజ్‌, ఓమ్నిబాక్స్‌ ఫ్రీ యూజ్‌వంటి లోపాల కారణంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా పొందే అవకాశం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సెర్ట్‌ ఇన్‌ సూచించింది. కొద్ది రోజుల క్రితమే యాపిల్‌ ఉత్పత్తులపై కూడా కేంద్రం తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. 

చదవండి: పెను ప్రమాదంలో ఐఫోన్‌, యాపిల్‌ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top