ఎల్‌ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు

Published Sat, Mar 16 2024 3:29 PM

Govt Approved 16 Percent Increase In Basic Wages For LIC Employees - Sakshi

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2022 నుంచి ప్రాథమిక వేతనాలను 16 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆమోదించింది. ఈ తాజా నిర్ణయంతో ఎల్‌ఐసీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఉన్న బకాయిలు పొందనున్నట్లు తెలిసింది. 

ప్రభుత్వ ఆమోదం తెలిపిన ప్రాథమిక వేతనం పెంపుతోపాటు అలవెన్సులతో కలిపి మొత్తం 22 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వేతన పెంపుతో 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

ఇదీ చదవండి: 180 ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ విమానయాన సంస్థ

ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎల్‌ఐసీకి వార్షికంగా రూ.4,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనున్నట్లు అంచనా. పెంపు తర్వాత ఎల్‌ఐసీ వేతన బిల్లు రూ.29,000 కోట్లకు చేరుతుందని తెలిసింది. 2010 ఏప్రిల్‌ తర్వాత సంస్థలో చేరిన దాదాపు 24,000 మంది ఉద్యోగుల ఎన్‌పీఎస్‌ వాటాను 10% నుంచి 14 శాతానికి పెంచారు.

Advertisement
 
Advertisement