Google Meet: నయా ఫీచర్లు, ఇక డౌట్లు అడగాలంటే..

Google Meet New Features For Online Classes And Livestream To YouTube - Sakshi

న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ గూగుల్‌ మీట్‌ కొన్ని కొత్త ఫీచర్స్‌ను తీసుకురాబోతోంది. ఆన్‌లైన్‌ క్లాస్‌ నిర్వాహణకు వీలుగా ఆ ఫీచర్లను డెవలప్‌ చేయించింది. అడ్మిన్లు, టీచర్లు, స్టూడెంట్స్‌ లక్క్ష్యంగా రూపొందించిన ఈ ఫీచర్లు.. చాలావరకు ఇబ్బందుల్ని తొలగిస్తాయని గూగుల్‌ మీట్‌ భావిస్తోంది.  

ఇక తాజా ఫీచర్ల వల్ల అడ్మిన్స్‌కి మీట్‌పై ఎక్కువ నియంత్రణ దక్కనుంది. కొత్తగా హ్యాండ్‌ రైజింగ్‌, లైవ్‌ క్యాప్షన్స్‌ ఫీచర్స్‌ తేనుంది. అంతేకాదు గూగుల్‌ మీట్‌ త్వరలో పబ్లిక్‌ లైవ్‌ స్ట్రీమ్స్‌ ఆఫ్షన్‌ను కూడా అనుమతించబోతోంది. అది కూడా నేరుగా యూట్యూబ్‌ ద్వారా కావడంతో పేరెంట్స్, పిల్లలు.. ఎవరైనా సరే ఆ మీటింగ్‌లకు అటెండ్‌ కావొచ్చు. అంతేకాదు ‘గూగుల్‌ మీట్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌’ ద్వారా టీచర్లు తమ ప్రజంటేషన్‌ సమీక్షతోపాటు స్టూడెంట్స్‌ ప్రజంటేషన్‌ను కూడా పరిశీలించేందుకు వెసులుబాటు కలగనుంది. ఇక టీచర్లు గూగుల్‌ నోట్‌ సెల్ఫ్‌ ఫీడ్‌ను మినిమైజ్‌ చేసి మరింతమంది స్టూడెంట్స్‌ను కాల్‌లో చేర్చుకోవడానికి వీలుంటుంది, అలాగే స్టూడెంట్స్‌ పేర్లు కూడా డిస్‌ప్లేపై కనిపిస్తాయి. 
 
డౌట్‌ వస్తే చెయ్యెత్తి..
స్టూడెంట్స్‌, టీచర్ల మధ్య కమ్యూనికేషన్‌ కోసం హ్యాండ్‌ రెయిజ్‌ ఐకాన్‌(చెయ్యి ఎత్తే సింబల్‌)ను, దానికి తగ్గట్లు సౌండ్‌ను డెవలప్‌ చేసింది గూగుల్‌ మీట్‌. తద్వారా స్టూడెంట్లు టీచర్లను కాంటాక్ట్ అవ్వొచ్చు. అలాగే అడ్మిన్‌ ఆ లిస్ట్‌ను గమనించి.. ఆర్డర్‌ ప్రకారం ఆ స్టూడెంట్‌ లిస్ట్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టూడెంట్‌ అనుమానం నివృత్తి అయ్యిందంటే.. ఆటోమేటిక్‌గా ఆ హ్యాండ్‌ సిబల్‌ డల్‌ అయిపోతుంది. మరో ముఖ్యమైన ఫీచర్‌.. లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌. ఎప్పటికప్పుడు అవతలివాళ్లకు తగ్గ భాషలోకి తర్జుమా చేసి చూపిస్తుంది. ఈ ఫీచర్స్‌తో పాటు హోస్ట్‌, టీచర్లు వీడియోలకు లాక్‌ వేసే వీలు, టాబ్లెట్‌.. మొబైల్‌ ఫోన్ల కోసం కూడా సేఫ్టీ కంట్రోల్‌ ఫీచర్లు కూడా రాబోతున్నాయి. ఈ ఏడాది బీటా వెర్షన్‌ను ప్రవేశపెట్టి.. వచ్చేడాది మొదట్లో నుంచి ఈ ఫీచర్లను యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనుంది గూగుల్‌ మీట్‌.

చదవండి: గూగుల్‌ ఫొటోస్‌లో ఉన్న ఫీచర్‌ ఇప్పుడు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top