గూగుల్‌ మ్యాప్స్‌లోని ఫ్లస్‌ కోడ్‌ గురించి తెలుసా?.. తెలిస్తే అడ్రస్‌ కోసం ఇబ్బంది పడక్కర్లేదు

Google Maps Allows Users Plus Code For Their Address - Sakshi

కొత్త ప్రదేశాల్లో.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి చాలామందికి గూగుల్‌ మ్యాప్స్‌ ఒక మార్గదర్శి. అయితే కచ్చితమైన అడ్రస్సుల విషయంలోనే ఒక్కోసారి గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తీర్చడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్‌ మ్యాప్స్‌. 

చాలామంది తమ హోం అడ్రస్సులను అవసరం ఉన్నప్పుడు కరెంట్‌ లేదంటే అడ్రస్‌ను టైప్‌ చేయడం ద్వారా వివరాల్ని షేర్‌ చేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా ఫ్లస్‌ కోడ్‌ని షేర్‌ చేస్తే సరిపోతుంది. ఫ్లస్‌ కోడ్‌లో హోం అడ్రస్‌ బదులు.. నెంబర్లు, లెటర్ల ఆధారంగా ఉదాహరణకు.. ‘CCMM+64G’ ఇలా నెంబర్లు, లెటర్ల ఆధారంగా కోడ్‌ రూపంలో కనిపిస్తుంది. మాటి మాటికి అడ్రస్‌ను టైప్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఇది షేర్‌(ఆల్రెడీ హోం అడ్రస్‌గా సేవ్‌ చేసి ఉంటారు కాబట్టి) చేస్తే సరిపోతుంది. 

గూగుల్‌ ఫ్లస్‌ కోడ్‌ను చాలా కాలం కిందటే(2018) తీసుకొచ్చింది. చాలాకాలం పాటు ఇది ఎన్జీవోలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్‌గా నిలిచి.. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ అందించనుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గ్రిడ్‌ తరహాలో ప్రాంతాలను విభజించుకుంటూ పోతుంది.  విశేషం ఏంటంటే.. రోడ్డు మార్గం, సరైన ల్యాండ్‌ మార్క్‌లు లేనిచోట్ల కూడా అదీ ఆఫ్‌లైన్‌లోనే(ఒక్కసారి సేవ్‌ చేస్తే సరిపోతుంది) ఫ్లస్‌ కోడ్‌ సరైన అడ్రస్‌ను లొకేట్‌ చేస్తుంది. 

కరెక్ట్‌గా అడ్రస్‌ పెడితేనే రావట్లేదు.. ఇంక ఫ్లస్‌ కోడ్‌ వర్కవుట్‌అవుతుందా? అంటారా? కచ్చితంగా అవుతుంది. ఎందుకంటే.. గూగుల్‌ మ్యాప్‌ తీసుకుచ్చిన ఫ్లస్‌ కోడ్‌ అనేది యూనివర్సల్‌. భూమ్మీద ప్రతీ లొకేషన్‌, అడ్రస్‌కు ఒక్కో ఫ్లస్‌ కోడ్‌ ఉంటుంది.  పైగా ఎగ్జాట్‌గా హోం లొకేషన్‌గా సేవ్‌ అవుతుంది కాబట్టి.  ఇది జనరేట్‌ చేయాలంటే.. యూజ్‌ యువర్‌ కరెంట్‌ లొకేషన్‌ ద్వారా చేయొచ్చు. సేవ్డ్‌ ట్యాబ్‌ను కూడా హోం అడ్రస్‌ కాపీ చేయడానికి, షేర్‌ చేయడానికి ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లలో మాత్రమే ఉంది. కింద వీడియోలో మరింత స్పష్టత రావొచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top