యూట్యూబ్‌ క్రియేటర్లకు గూగుల్‌ భారీ షాక్‌!

Google Has Announced Plans To Shut Down Youtube Go - Sakshi

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో లాంఛ్‌ చేసిన 'యూట్యూబ్‌ గో'ను షట్‌ డౌన్‌ చేస్తున్నట్లు తన బ్లాగ్‌ పోస్ట్‌లో అధికారికంగా ప్రకటించింది. గూగుల్‌ నిర్ణయంతో కొంత మంది యూజర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. 

2016లో గూగుల్‌ సంస్థ యూట్యూబ్‌గోను విడుదల చేసింది. కనెక్టివిటీ తక్కువగా ఉండి, ప్రాసెసర్‌  స్లోగా ఉండి, లిమిటెడ్‌గా టెక్నాలజీ అందుబాటులో ఉండే లో ఎండ్‌ మొబైల్‌ ఫోన్స్‌ వినియోగిస్తున్న యూట్యూబ్‌ క్రియేటర్స్‌ కోసం యూట్యూబ్‌ తరహాలో 'యూట్యూబ్‌ గో'ను అందుబాటులోకి తెచ్చింది. కానీ యూట్యూబ్‌ను ఎలా డెవలప్‌ చేసిందో ఆ స్థాయిలో యూట్యూబ్‌ గోను అభివృద్ధి చేయడం అసాధ్యంగా మారింది. అందుకే ఇకపై యూట్యూబ్‌ గో సేవల్ని నిలిపివేస్తున్నట్లు గూగుల్‌ ప‍్రకటించింది. ఈ ప్రకటనతో లో ఎండ్‌ మొబైల్స్‌ ఫోన్స్‌తో యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్న క్రియేటర్లకు షాక్‌ తగలనుంది. 

కానీ గూగుల్‌ మాత్రం యూట్యూబ్‌ గో క్రియేటర్లకు ఎలాంటి నష్టం లేదని, యూట్యూబ్‌ గో క్రియేటర్లు  మెయిన్‌ స్ట్రీమ్‌ యాప్‌ యూ ట్యూబ్‌ను వినియోగించాలని కోరింది. లోఎండ్‌ మొబైల్స్‌ వినియోగిస్తున్న యూజర్లు సైతం యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసేలా మార్పులు చేసినట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది. అంతేకాదు యూట్యూబ్‌ గోలో అందుబాటులో లేని ఫీచర్‌లను యూట్యూబ్‌లో అందిస్తున్నామని..ఆ ఫీచర్‌లలో కామెంట్ చేయడం, పోస్ట్ చేయడం, కంటెంట్ క్రియేట్‌ చేసేలా అవకాశం కల్పించడంతో పాటు డార్క్‌ థీమ్‌ను అందిస్తున్నట్లు' కంపెనీ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

చదవండి👉యూట్యూబ్‌కు భారీ షాక్‌..! పడిపోతున్న యూజర్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top