
మనం మాట్లాడుకునే మాటల్ని గూగుల్ గుట్టుగా వింటోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందిస్తూనే చాటుమాటు వ్యవహరాలు నడిపిస్తోంది. ఈ విషయాన్ని టెక్ దిగ్గజం గూగుల్ స్వయంగా అంగీకరించనుంది. ఇదే విషయాన్ని పార్లమెంటరీ కమిటీ సమావేశంలోనూ అంగీకరించేందుకు గూగుల్ సిద్ధమైంది.
గూగుల్ అసిస్టెంట్ ద్వారా వినియోగదారుల ప్రైవేటు రికార్డింగ్స్‌ని తమ కంపెనీ ఉద్యోగులు వింటున్నారని, ఇదంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా జరుగుతోందని గూగుల్ ప్రతినిధులు అంటున్నారు. గూగుల్ అసిస్టెంట్ ఆప్షన్ కలిగిన ఫోన్లలో ఇది జరగుతోందని చెప్పింది. దాదాపుగా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ ఆప్షన్ ఉంటుంది.
చదవండి : JBL CSUM10 Microphone: మీరు కంటెంట్ క్రియేటర్లా..? ఐతే ఇది మీకోసమే..!