Gold Price Today: బంగారం ధరల స్పీడ్‌కు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా ఆగకుండా దూసుకెళ్లి కొత్త మార్కులకు చేరిన పసిడి పెరిగింది చాలులే అన్నట్లు కాస్త విరామం తీసుకుంది. దేశవ్యాప్తంగా నేడు (సెప్టెంబర్ 26) బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ రేట్లలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.
ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.70,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,020 వద్ద ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే రేట్లు కొనసాగుతన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి రూ.70,750 వద్ద స్థిరంగా ఉండగా 24 క్యారెట్ల బంగారం మాత్రం అత్యంత స్పల్పంగా రూ.10 పెరిగి రూ.77,180 వద్ద ఉంది.
వెండి స్వల్పంగా..
Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి.  క్రితం రోజున కేజీకి రూ.3000 పెరిగి బెంబేలెత్తించిన వెండి నేడు రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.1,01,100 లుగా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
